Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

విశ్వక్ సేన్ హీరోగా కయాడు లోహర్ హీరోయిన్ గా అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫంకీ'(Funky). ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకున్నాయి. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేశాయి. అందువల్ల బిజినెస్ కూడా డీసెంట్ గా జరిగింది. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతుంది.

Funky

ఓవర్సీస్ లో అయితే నాగవంశీ తన ఫ్రెండ్స్  ద్వారా రిలీజ్ చేసుకున్నారు.మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో కామిడీ ఉన్నప్పటికీ.. కథ, కథనాలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేవు అంటూ ఆడియన్స్ కొట్టిపారేశారు. అయినప్పటికీ మొదటి రోజు పర్వాలేదు అనిపించే రేంజ్లో ఓపెనింగ్స్ వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.59 cr
సీడెడ్ 0.11 cr
ఆంధ్ర(టోటల్) 0.35 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.05 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.12 cr
ఓవర్సీస్ 0.68cr
వరల్డ్ వైడ్(టోటల్) 1.85 cr

‘ఫంకీ’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.11.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కొరకు రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.1.85 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.55 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.10.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus