Sitara: సితార కొత్త యాడ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • July 19, 2023 / 07:12 PM IST

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఓ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ప్రమోషన్ కూడా ఇటీవల జరిగింది. అందులో సితార ఎంతో చురుగ్గా పాల్గొంది. తనకి యాడ్ రూపంలో వచ్చిన అమౌంట్ ను చారిటీకి ఇచ్చేసాను అంటూ ఈమె చెప్పడంతో రెండు రోజుల పాటు ట్రెండింగ్లో నిలిచింది సితార. సోషల్ మీడియాలో సితారకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఏ స్టార్ కిడ్ కి సాధ్యం కానీ అవకాశం ఈమెకి నచ్చింది.

ఇక సితార (Sitara) నటించిన లేటెస్ట్ యాడ్ రిలీజ్ అయ్యింది. ఇది జ్యూయలరీ షాప్ కి సంబంధించిన యాడ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాడ్ 3 నిమిషాల 21 సెకన్ల నిడివి కలిగి ఉంది.ఇక యాడ్ ను చూస్తే.. ఇది ఓ అమ్మమ్మకి తన మనవరాలికి మధ్య ఉన్న ఎమోషన్ ను తెలియజేస్తుంది. అమెరికా నుండి వచ్చిన తన మనవరాలికి ఓణీల ఫంక్షన్ అంటే నచ్చదు. ఈ క్రమంలో తనకి ఆ ఫంక్షన్ పై ఆసక్తి కలిగేలా..

ఆ అమ్మమ్మ నగల షాప్ కి తీసుకెళ్లి వజ్రాల హారాలు వంటివి చూపించడం.. వాటికి ఆమె ఆకర్షితురాలు కావడం వంటివి ఈ యాడ్ లో చూపించారు. ఈ యాడ్ కి సితార లుక్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.తండ్రి మహేష్ లానే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో సితార కూడా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus