టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. యాడ్స్ ద్వారా మహేష్ బాబు కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. మహేష్ ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయాన్ని అందుకుంటున్నారు. అయితే సితార కూడా బ్రాండ్ అంబాసిడర్ గా కెరీర్ ను మొదలుపెడుతున్నారు. మహేష్ కూతురిగా సితారకు ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు అంతాఇంతా కాదు.
సితార డ్యాన్స్ వీడియోలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తాయి. సితార వయస్సు తక్కువే అయినా చాలా టాలెంటెడ్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో సితారకు ఏకంగా 12 లక్షల కంటే ఎక్కువగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రముఖ జ్యూవెల్లరీ సంస్థ సితారను సంప్రదించిందని రెమ్యునరేషన్ భారీ స్థాయిలోనే ఉందని సమాచారం. 20 లక్షలకు అటూఇటుగా సితార రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
సితార (Sitara) నటిస్తున్న ఈ యాడ్ షూట్ ఇప్పటికే పూర్తైందని సమాచారం. మూడు రోజుల పాటు ఈ యాడ్ షూట్ జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ టెక్నీషియన్లు ఈ యాడ్ కోసం పని చేయగా త్వరలో ఈ యాడ్ బుల్లితెరపై ప్రసారం కానుంది. ఈ విషయం తెలిసిన మహేష్ అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. మరోవైపు ఈ నెల 31వ తేదీన మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించిన షాకింగ్ అప్ డేట్ రానుంది.
మహేష్ బాబును త్రివిక్రమ్ ఏ విధంగా చూపించబోతున్నారో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో మహేష్ లుక్ కూడా కొత్తగా ఉండనుందని సమాచారం అందుతోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలను మించి మహేష్ త్రివిక్రమ్ కాంబో కొత్త మూవీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.