టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.ఇలా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న మహేష్ బాబు తన జీవితంలో ఏదైనా ప్రత్యేకమైన రోజులు ఉన్న లేకపోతే ఇతర హీరోల సినిమాలు విడుదలైన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే నేడు మహేష్ బాబు (Mahesh Babu) తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు కావడంతో తన తల్లిని గుర్తు చేసుకుని మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.తన తల్లితో కలిసి దిగిన ఫోటోని మహేష్ బాబు షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్డే అమ్మ. ఎప్పటికీ నీకు కృతజ్ఞుడిని అంటూ మహేష్ బాబు షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే మహేష్ బాబు కుటుంబంలో వరుసగా విషాదాలు చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
గత ఏడాది మొదట్లో తన అన్నయ్య రమేష్ బాబు మరణించగా సెప్టెంబర్ నెలలో తన తల్లిఇందిరా దేవి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. అయితే ఈమె మరణించి నెలరోజులు కూడా గడవకముందే సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా మరణించారు.ఇలా గత ఏడాది మహేష్ బాబు కుటుంబంలో తన తల్లి తండ్రి అన్నయ్య వరుసగా మరణించడంతో ఎంతో విషాదంలో మునిగిపోయారు. ఇక ఈ ఏడాది మహేష్ బాబుకు చాలా మంచిగా ఉండాలని ప్రతి ఒక అభిమాని కోరుకున్నారు.
ఇకపోతే మహేష్ బాబు సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు అనే విషయం మనకు తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలో తనకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన వెంటనే తన భార్య పిల్లలతో కలిసి ఈయన విదేశీ పర్యటనలకు వెళ్తూ కుటుంబంతో పూర్తి సమయాన్ని కడుపుతో ఉంటారు.ఇలా మహేష్ బాబు సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉండగా తన భార్య నమ్రత పిల్లల బాగోగులను కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ ఉంటారు.