టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన ప్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో మంచి ఊపుమీద ఉన్నాడు అని అందరూ అందుకున్నారు. అదే క్రమంలో సరికొత్త ఫ్యామిలీ కధతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తీసిన శ్రీకాంత్ అడ్దాల కు మరో అవకాశం ఇచ్చాడు. అయితే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయిన శ్రీకాంత్ చివరకు బ్రహ్మోత్సవం అన్న డిజాస్టర్ ను ప్రిన్స్ కు అందించాడు.
ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో అటు ప్రిన్స్ అభిమానులు, మాత్రమే కాకుండా ప్రిన్స్ సైతం చాల్ హర్ట్ అయ్యాడట. ఇదిలా ఉంటే అదే క్రమంలో తమిళ డబ్బింగ్ చిత్రం ‘బిచ్చగాడు’ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, కాంటెంట్ పరంగా మదర్ సెంటిమెంట్ తో అందరి మనసు గెలిచింది. ఏకంగా 16 కోట్ల కలెక్షన్లు సాధించి హిట్ సినిమాగా దూసుకు పోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇక సక్సెస్ మీట్ లో భాగంగా, ఈ చిత్రంపై కామెంట్ చేశారు బాలకృష్ణ, బాలకృష్ణ అంటే మన టాలీవుడ్ కింగ్ బాలయ్య అనుకునేరు…కాదు కాదు ఎమెల్యే…రసమయి బాలకృష్ణ, ఈ నాయకుడు మాట్లాడుతూ…బ్రహ్మోత్సవం బాక్సాఫీస్ వద్ద బిచ్చగాడి లా మారిందని కానీ బిచ్చగాడు మాత్రం కలెక్షన్ల బ్రహ్మోత్సవం కురిపిస్తోందని అని అన్నాడు.
ఇక ఇదే విషయమై ప్రిన్స్ ఫాన్స్ చాలా కోపంగా ఉన్నారు. సినిమా అన్న తర్వాత ఒకటి హిట్ అవుతుంది..మరోటి ఫ్లాప్ అవుతుంది. అంత మాత్రానా ఇంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం లేదని రసమయి పై మండిపడుతున్నారు మహేష్ ఫ్యాన్స్. ఏది ఏమైనా…ఇండస్ట్రీ లో హిట్స్ ఫ్ల్యాప్స్ సహజం…అనే చెప్పాలి.