వైకుంఠపురములో సక్సెస్ సెలబ్రేషన్స్ లో స్పీచ్ కి గట్టి ఎఫెక్ట్

“సరిలేరు నీకెవ్వరు” సినిమా ఎంతటి ఘన విజయం సాధించినా.. “మైండ్ బ్లాక్” సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసినా కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పనితనం మీద కాస్త గుర్రుగానే ఉన్నారు. నెక్స్ట్ సినిమాలో మాత్రం దేవిశ్రీప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవద్దని ట్విట్టర్ సాక్షిగా నిన్న సాయంత్రం వరకూ రచ్చ చేశారు.

కట్ చేస్తే.. నిన్న రాత్రి నుండి మాత్రం మహేష్ & దేవి కాంబినేషన్ ఎన్నిసార్లు రిపీట్ అయినా పర్లేదు అని ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తున్నారు. కొన్ని గంటల్లోనే మహేష్ ఫ్యాన్స్ మైండ్ సెట్ మారిపోవడానికి కారణం ఏంట్రా అంటే.. నిన్న జరిగిన “అల వైకుంఠపురములో సక్సెస్ సెలబ్రేషన్స్”లో తమన్ మాట్లాడుతూ.. “నిజమైన కలెక్షన్సే చెప్పాం మేము.. వచ్చాం గెలిచామ్” అంటూ చెప్పిన మాటలు మహేష్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. తమన్ కావాలనే మహేష్ సినిమా కలెక్షన్స్ ను దెప్పిపొడుస్తూ ఇలా మాట్లాడాడని ఫ్యాన్స్ ఫీలయ్యారు. దాంతో తమన్ ని ట్విట్టర్ లో బూతులు తిట్టడమే కాక.. “దూకుడు, ఆగడు, బిజినెస్ మ్యాన్” లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన తమన్ తో మరోసారి మహేష్ పనిచేయకూడదని అల్టిమేటాలు జారీ చేయడం మొదలెట్టారు. ఈ విషయాన్ని మహేష్ ఎంత సీరియస్ గా తీసుకొంటాడు అనే విషయం పక్కన పెడితే.. ఫ్యాన్స్ మాత్రం తమన్ మీద కోపంతో రగిలిపోతున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus