సినిమాలు, రాజకీయాలు వేరు వేరు, ఒకప్పుడు సినిమాల్లో నటించిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే చాలా ఆలోచించేవారు. అదే క్రమంలో ఎన్నో విమర్శలను సైతం ఎదుర్కునే వారు, ఒంటికి రంగులు వేసుకునే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారు అని ఎన్నో విమర్శలు వచ్చేవి. అయితే అదే క్రమంలో ఎన్టీఆర్ వంటి మహానుబావుడు స్థాపించిన పార్టీ తెలుగువారికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అయితే అదే తరహాలో చాలా మంది తారలు సైతం కొత్త పార్టీ పెట్టి దుమ్ము దులిపేయ్యాలి అన్న ఆలోచనతో వారికున్న మాస్ ఇమేజ్ ను ఉపయోగించుకుని విశ్వప్రయత్నాలే చేసి సొంత ఊరిలో ఓడిపోయారు.
ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం జనసేన అన్న పేరుతో పార్టీ స్థాపించి 2019లో ఎన్నికల బరిలో దిగనున్నాడు. ఇదిలా ఉంటే ప్రతీ హీరో ఏదో ఒక పార్టీకి అనుసంధానంగానే పనిచేస్తున్నారు. అదే క్రమంలో టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన ప్రిన్స్ మహేష్ బాబు సైతం పొలిటికల్ టర్న్ తీసుకుంటాడేమొ అని సర్వత్రా చర్చ నెలకొంది. గతంలో ప్రిన్స్ తండ్రి కృష్ణ కొంగ్రెస్ లో చక్రం తిప్పారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా ప్రస్తుతం ప్రిన్స్ ఫ్యామిలీ టీడీపీకి అనుసంధనంగా ఉంది.
ఇలాంటి క్రమంలో మహేష్ జగన్ తో కలసి ముందుకు వెళ్లనున్నాడు అని అంటున్నాడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు…ఏపీలో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జగన్ తో కలిసి మహేష్ బాబు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారని చర్చ జరుగుతున్న తరుణంలో తాజాగా నిర్వహించిన ఓ ఇంటెర్వ్యులో తన మనసులోని మాటను బయటపెట్టారు మోహన్ బాబు. వినడానికి వింతగా ఉంది…మరి దీనిపై ప్రిన్స్ ఏమంటాడో??