నెటిజన్లపై మండిపడుతున్న సరిలేరు నీకెవ్వరు నిర్మాతలు
- December 16, 2019 / 11:10 AM ISTByFilmy Focus
ఒక్కోసారి అభిమానులు చేసే చిన్నపాటి పనులు నిర్మాతలకు పెద్ద తలపోట్లుగా మారతాయి. ఇటీవల “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలోని “మైండ్ బ్లాక్” పాటకు మహేష్ బాబు, రష్మికకు శేఖర్ మాస్టర్ డ్యాన్స్ స్టెప్పులు వివరిస్తున్న వీడియో ఒకటి దాదాపు అన్నీ సోషల్ మీడియా యాప్స్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. మహేష్ బాబు లుంగీతో ఉన్న ఈ వీడియో చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే.. ఈ లుంగీ గెటప్ ను నిర్మాతలు మంచి సస్పెన్స్ గా రిలీజ్ చేద్దామనుకున్నారట. రిలీజ్ కి ఇంకా కొన్నిరోజులే ఉండగా స్పెషల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసిన బృందం ఈ మాస్ యాంగిల్ రివీల్ చేయడం కోసం చాలా ప్లానింగ్స్ చేసుకొన్నారు. అయితే.. సెట్స్ లో ఎవరో ఈ వీడియోను లీక్ చేయడంతో వాళ్ళ ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది.

ఇదే విషయమై ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ.. “అసలు క్లారిటీ లేని అలాంటి వీడియోలను జనాలు ఎందుకు షేర్ చేస్తారో అర్ధం కాదు” అని చాలా ఇరిటేట్ అవుతూ సమాధానం ఇచ్చారు. నిర్మాతలు ఇరిటేట్ అవ్వడంలో తప్పులేదు కానీ… అభిమానులు కూడా తమ హీరో నటించిన సినిమా వీడియోలను షేర్ చేయకుండా ఉంటే ఈ వైరల్ గోల సగం తగ్గేది.
#MaSSMBFestivalOnJan11th superstar on dance. 🤙🤙🤙#MindBlock #SarileruNekkevvaru #MaheshBabu @urstrulyMahesh pic.twitter.com/kjIOh1osOE
— MASS#MB (@kingmaker7722) December 14, 2019
వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

















