Maharshi Movie: ఈ రికార్డులు మహేష్ కు మాత్రమే సాధ్యమా..?

Ad not loaded.

సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు 25వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించడం గమనార్హం. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ టీవీ ఈ సినిమా శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసింది.

మహేష్ బాబు ఫ్యాన్స్ కు బాగా నచ్చేసిన ఈ సినిమా బుల్లితెరపై పదోసారి ప్రసారమై అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంది. ఈ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకోవడం సాధారణ విషయం కాదని మహేష్ బాబు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మహేష్ బాబుకు మాత్రమే ఇలాంటి రికార్డులు సాధ్యమవుతాయని కామెంట్లు చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఈ వార్త తెలిసి సంతోషించడంతో పాటు సంబరాలు జరుపుకుంటున్నారు.

మరోవైపు మహేష్ ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు లెంగ్తీ విదేశీ షెడ్యూల్ ఉండగా త్వరలో సర్కారు వారి పాట చిత్రయూనిట్ విదేశాలకు బయలుదేరనుందని సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తైన తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది మహేష్ నటించిన ఒక్క సినిమా రిలీజ్ కాకపోయినా వచ్చే ఏడాది మాత్రం మహేష్ హీరోగా తెరకెక్కుతున్న రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus