ఈ ముగ్గురి అనూహ్య కలయిక వెనుక ఉన్నది ఆ ముగ్గురేనా

మహేష్ బాబు నాకు అన్నయ్య లాంటివాడు అని ఎన్టీఆర్ స్వయంగా “భరత్ అనే నేను” బహిరంగ సభలో ప్రకటించినా, ‘ఎన్టీఆర్ నాకు బెస్ట్ ఫ్రెండ్’ అంటూ రామ్ చరణ్ ఒక మీడియా హౌస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినా, మహేష్ బాబు స్వయంగా “తమ్ముడు ఎన్టీఆర్” అంటూ పబ్లిక్ ఈవెంట్ లో ప్రేమతో పిలిచినా.. ఈ శుభపరిణామాలన్నీ మొదలైంది మాత్రం ఈ ముగ్గురు హీరోలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమాలో చేసిన తర్వాతే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో మహేష్ బాబు “శ్రీమంతుడు” సినిమా చేయగా, ఎన్టీయార్ “జనతా గ్యారేజ్“ని ప్రొడ్యూస్ చేసింది మైత్రీ సంస్థ, ఇక రామ్ చరణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ “రంగస్థలం” చిత్రాన్ని నిర్మించింది కూడా మైత్రీ సంస్థే కావడం విశేషం.

ఈ ముగ్గురు హీరోలు ఇంతకుమునుపు స్నేహపూర్వకంగా మెలిగేవారా కాదా అనేది ఎవరికీ తెలియదు కానీ.. మైత్రీ సంస్థలో సినిమాలు చేసిన తర్వాత మాత్రం మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీయార్ ల నడుమ మంచి స్నేహం కుదిరింది. మొన్నామధ్య “భరత్ అనే నేను” బహిరంగ సభ అనంతరం నిర్వహించిన ఆఫ్టర్ పార్టీలో కలిసిన చరణ్-తారక్-మహేష్ ల త్రయం మళ్ళీ నిన్న సాయంత్రం మరో ప్రయివేట్ పార్టీలో కలిసి కనిపించారు. ఆ ఫోటో నిన్నటి నుండి మూడు కుటుంబాల అభిమానుల కళ్ళకి విశేషమైన ఆనందాన్ని పంచుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus