విశాల్ సినిమా బాగుందంటూ మహేష్ ప్రశంసలు!

ఈ మధ్యకాలంలో హీరోలు తమ తోటి కథానాయకుల సినిమాల్ని మెచ్చుకోవడం అనేది ఒక ట్రెండ్ లా అయ్యింది. ఇది శుభపరిణామం అనే చెప్పాలి. “రంగస్థలం”కి ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు ప్రశంసల వర్షం కురిపిస్తే.. “భరత్ అనే నేను”పై ఆల్మోస్ట్ ఇండస్ట్రీలోని హీరోలందరూ పాజిటివ్ ట్వీట్స్ తో మహేష్ ను అభినందించారు. అయితే.. ఇటీవల కాలంలో తన 25వ సినిమా స్టార్ట్ అవ్వడానికి కాస్త ఎక్కువ టైమ్ పట్టడంతో ఆ టైమ్ ను వేస్ట్ చేసుకోకుండా ఈమధ్యకాలంలో విడుదలైన సినిమాలన్నీ స్పెషల్ షో వేయించుకొని చూశాడట మహేష్ బాబు.

వాటిలో మొదటిది సుధీర్ బాబు నటించిన “సమ్మోహనం”, రెండోది విశాల్-సమంత జంటగా తెరకెక్కిన సైబర్ థ్రిల్లర్ “అభిమన్యుడు”. “సమ్మోహనం” గురించి రెండ్రోజుల క్రితమే స్పందించిన మహేష్ బాబు ఇవాళ ఉదయం “అభిమన్యుడు” సినిమా చాలా బాగుందంటూ మెచ్చుకోవడంతోపాటు విశాల్ కి కాంగ్రాట్స్ కూడా చెప్పాడు. ఈ ప్రశంసల ప్రవాహం ఇలానే కొనసాగాలని ప్రతి హీరో తన సినిమాతోపాటు తన తోటి హీరోల హిట్ సినిమాలను ప్రమోట్ చేయాలని అందరి అభిమానులు కోరుకొంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus