దసరా పండుగ ఎన్టీఆర్ కంటే మహేష్ కే కలిసి వచ్చింది!

సంక్రాంతి పండుగ అప్పుడు ఉండే పోటీ దసరాకి కూడా ఏర్పడింది. ఈ ఏడాది చిరంజీవి, బాలకృష్ణ పెద్ద పండుగ నాడు బరిలో దిగి సత్తా చూపించారు. ఈ దసరాకి సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల మధ్య వార్ జరగబోతోంది. జై లవకుశ, స్పైడర్ సినిమాలు వేటికవే ప్రత్యేకం. రెండూ క్రేజీ ప్రాజక్ట్ లే. అయితే మనవాళ్ళు లాజిక్ లకంటే మ్యాజిక్ లే ఇష్టపడుతారని త్రివిక్రమ్ ఒక సినిమాలో రాసినట్లు… సినీ ప్రజలకు సెంటిమెట్లు ఎక్కువ. దసరా హీరో మహేష్ బాబు అని ఫిక్స్ చేసేసారు. కారణం విశ్లేషిస్తే.. గతంలో మహేష్ చిత్రాలు ఒక్కడు, ఖలేజా, దూకుడు .. దసరా సీజన్లోనే రిలీజ్ అయ్యాయి. ఇందులో ఖలేజా నిరాశపరిచినా ఇతర రెండు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. ఇక ఎన్టీఆర్ సినిమాలు దసరాకి నాగ, బృందావనం, ఊసరవెల్లి విడుదలయ్యాయి.

ఇందులో నాగ ఫెయిల్ కాగా, మిగతా రెండూ యావరేజ్ చిత్రంగా నిలిచాయి. ఈ లెక్కన ఈ దసరాకి కూడా మహేష్ హిట్ సాధిస్తాడని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలను నందమూరి అభిమానులు తిప్పికొడుతున్నారు. ఎన్టీఆర్ కస్టపడి చేసిన జై లవకుశ మూవీ సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరి మాట నిజమవుతుందో కొన్ని రోజుల్లో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus