విజయ్ కు మహేష్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడే…!

  • August 8, 2019 / 06:22 PM IST

ప్రస్తుతం హీరోలకు ఎంత క్రేజ్ ఉన్నా… వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా.. వారి బ్రాండ్ ను జనాలకు చేరువయ్యేలా చేసుకోవాలనే ఆలోచన రోజు రోజుకి పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ ఆ లిస్ట్ లో ముందున్నాడు. ‘పెళ్ళిచూపులు’ ‘అర్జున్ రెడ్డి’ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు కొట్టి స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న విజయ్ ఆ తరువాత ‘రౌడీ’ బ్రాండ్ దుస్తులను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గీత గోవిందం’ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఆ దుస్తుల్లో కనిపించి ఆ చిత్రానికి మరింత క్రేజ్ తీసుకొచ్చాడు. తన అభిమానులని కూడా ముద్దుగా ‘రౌడీస్’ అని పిలుస్తుంటాడు విజయ్. ఇప్పుడు దీనికి మహేష్ కౌంటర్ ఇచ్చాడా అనే డిస్కషన్స్ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.

విషయం ఏమిటంటే.. తాజాగా మహేష్ కూడా తన క్లాతింగ్ బ్రాండ్ ను లాంచ్ చేశాడు. దానికి ‘హంబుల్’ అనే పేరును పెట్టాడు. హంబుల్ ఇంగ్లిషు అక్షరాల్లో ఎంబీ (మహేష్ బాబు) అని ఉంది. ‘ఇదంతా అనుకోకుండా జరిగిందే తప్ప ప్లాన్ చేసింది కాదని’ చెప్పుకొచ్చాడు మహేష్. ఇంతకీ ‘హంబుల్’ అనే పేరుతో బ్రాండింగ్ ఎందుకు మొదలుపెట్టారు? ఆ పేరునే ఎందుకు డిసైడ్ చేశారు అని అడిగిన ప్రశ్నకు.. మహేష్ వ్యాపార భాగస్వామి ఆసక్తికర సమాధానాన్ని చెప్పుకొచ్చాడు. ‘హుంబుల్’ పేరు పెట్టడానికి ముందు భారీ ఎత్తున ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నామని.. మహేష్ కు ఉండే ఇమేజ్.. అతన్ని ఎలా పిలుస్తారు? అతని వ్యక్తిత్వం గురించి ఏమనుకుంటారు? ఇలాంటి ఎన్నో అంశాలను రీసెర్చ్ చేసిన తర్వాతే ‘హంబుల్’ ని ఫైనల్ చేసినట్టుగా’ తెలిపాడు. ఏమైనా ‘హుంబుల్’ తో విజయ్ కు మహేష్ గట్టి కౌంటర్ ఇచ్చినట్టే కనిపిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus