Mahesh Babu, Jawan: లెజెండ్స్ బరిలోకి దిగితే ఇలాగే ఉంటుంది.. మహేష్ ట్వీట్ వైరల్!

  • September 8, 2023 / 06:36 PM IST

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజాగా జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నయనతార షారుక్ ఖాన్ జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లో సంచలనాలను సృష్టిస్తుంది. ప్రతి ఒక్క భాషలో ఈ సినిమా అద్భుతమైన ఆదరణ పొందుతుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని వీక్షించి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇక ఈ సినిమా విడుదలకు ముందు సూపర్ స్టార్ (Mahesh) మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ట్వీట్ పై స్పందించిన షారుక్ ఇద్దరం కలిసి సినిమా చూద్దాం ఎప్పుడు చూద్దాం చెప్పు అంటూ కూడా రిప్లై ఇచ్చారు. అయితే తాజాగా మహేష్ బాబు ఈ సినిమాని వీక్షించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా పై మహేష్ బాబు తన రివ్యూని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

గత కొద్దిరోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైనటువంటి హిట్ సినిమాలు లేక బాలీవుడ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అయితే షారుక్ ఖాన్ బరిలోకి దిగగానే పఠాన్ సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. ఈ సినిమా అనంతరం ఈయన జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా కూడా సంచలనమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా పట్ల మహేష్ బాబు స్పందిస్తూ… జవాన్ బ్లాక్ బస్టర్ సినిమా. డైరెక్టర్ అట్లీ రాజును రాజు లాగా చూపిస్తూ వినోదాన్ని పంచిపెట్టారు.

ఇది షారుక్ ఖాన్ కెరియర్ లోనే బెస్ట్ ఫిలిం. ఆయన తెరపై కనిపించినప్పుడు వచ్చిన ఆ ఆరా, చరిష్మా ఇంక ఎవ్వరిలోనూ కనిపించదు. ఆయన స్క్రిన్ ప్రజెన్స్, ఎనర్జీ ఎవరూ మ్యాచ్ చేయలేరు. తెరపై ఫైర్ పుట్టించేశాడు. జవాన్ చిత్రంతో తన రికార్డ్స్ తనే బద్దలు కొట్టేసుకుంటున్నాడు. ఇది వినడానికి చాలా బాగుంది లెజెండ్స్ బరిలోకి దిగితే ఇలాగే ఉంటుంది అంటూ మహేష్ బాబు జవాన్ సినిమాపై తన రివ్యూ ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ చేసినటువంటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus