‘నా సినిమా కోసం 3 ఏళ్లు ఎదురుచూసాడు. ఏ డైరెక్టర్ కూడా అంతలా వెయిట్ చెయ్యడు.నేను ఏ డైరెక్టర్ ను కూడా పేరు పెట్టి పిలవను. వంశీ ని మాత్రమే పేరు పెట్టి పిలుస్తాను. అతను నాకు బ్రదర్ లాంటి వాడు’ ఇవి ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ లు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మహేష్ ఫ్యామిలీతో మరింత క్లోజ్ అయిపోయాడు వంశీ. వీళ్ల రెండు ఫ్యామిలీస్ కలిసి విదేశాలకు కూడా వెళ్లాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ తన తదుపరి సినిమా వంశీ తోనే అని కూడా చెప్పేసాడు. కానీ తరువాత కథ నచ్చలేదని చెప్పి వంశీని పక్కన పెట్టేసాడు.
అయితే కథ పూర్తిగా విన్నాకే వంశీ తో సినిమా చేసేది లేనిది మహేష్ చెప్పి ఉండాల్సింది. వంశీ తో సినిమా ఉంటుందని చెప్పి సడెన్ గా వేరే దర్శకుడితో సినిమా అనౌన్స్ చెయ్యడంతో… వంశీ కెరీర్ డైలమాలో పడినట్టు అయ్యింది. వంశీ స్క్రిప్ట్ వినడానికి కూడా చాలా మంది హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పోనీ మహేష్ కోసమే వెయిట్ చెయ్యాలి అనుకుంటే… సడన్ గా రాజమౌళి ఎంట్రీ ఇచ్చాడు. 2022 లో మహేష్ – రాజమౌళి ల ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ లు ఉన్నాయని భోగట్టా..! ఈ క్రమంలో ‘సర్కారు వారి పాట’ 2021 చివరికి గానీ పూర్తవ్వదు.
కాబట్టి మహా అయితే మహేష్ ఒక్క సినిమా మాత్రమే చేస్తాడు. దాని కోసం త్రివిక్రమ్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్లు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. వీరిలో అనిల్ రావిపూడి తోనే మహేష్ సినిమా చేసే ఛాన్స్ లు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రాజమౌళి తో మహేష్ సినిమా పూర్తవ్వాలి 2024 పూర్థయ్యి 2025 వచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి వంశీ కి మహేష్ గుడ్ బై చెప్పేసినట్టే అని చెప్పాలి.
Most Recommended Video
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!