కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన మూవీ భరత్ అను నేను. శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని నిర్మాత డి.వి.వి. దానయ్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన మహేష్ బాబు అనేక ఆసక్తికర విషయాలు చెప్పారు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా సమాజంలో మార్పు వస్తుందని అనుకుంటున్నారా? అని అడగగా.. అందుకు మహేష్ స్పందిస్తూ.. “సినిమా ఒక పెద్ద మీడియా.
దీని ద్వారా సమాజంలో అన్ని అన్ని మార్చేస్తామని మేము చెప్పలేము. కానీ కొంత మార్పు జరిగేలా ఆలోచన విధాన్ని మార్చగలం” అని అన్నారు. భరత్ అనే నేను సినిమాతో ఆ విధంగా ప్రేక్షకులపై ఒత్తిడి తీసుకువస్తున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ… “భరత్ అనే నేను సినిమాతో ప్రేక్షకులకు సమాజం పట్ల బాధ్యతో ఉండాలని ఒత్తిడి చేయడం లేదు. కానీ ఎలా నడుచుకోవాలో ఒక దారిని చూపిస్తున్నాము. అంతే” అని అన్నారు. మరి నిజ జీవితంలో పాలిటిక్స్ లోకి వస్తారా ? అంటే తనకు రాజకీయంలోకి రావాలని లేదని స్పష్టం చేశారు. మరిన్ని మంచి కథలను చెప్పాలని ఉందని వెల్లడించారు.