“మీలాంటి అభిమానులు నాకు తెలిసి ఏ హీరోకీ ఉండరు.. ఎందుకంటే, నాకు నచ్చుతారు మీరెప్పుడూ.. మీరు నా సినిమా నచ్చితేనే చూస్తారు, నచ్చకపోతే మీరే చూడరు.. మీరెప్పుడూ అలానే ఉండాలి, మీకోసం మంచి సినిమాలు చేయడం కోసం ట్రై చేస్తూనే ఉంటాను” అంటూ మహేష్ బాబు చాలా వినమ్రతతో.. నవ్వుతూ చెప్పిన మాటల వెనుక ఎంతో బాధ దాగి ఉందని తెలుస్తోంది.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే రికార్డ్స్ సృష్టించేస్తుటాయి. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ “సర్దార్ గబ్బర్ సింగ్”. కంటెంట్ వైజ్ చూసుకుంటే “బ్రహ్మోత్సవం”కి మించిన డిజాస్టర్ “సర్దార్ గబ్బర్ సింగ్” కానీ.. పవన్ కళ్యాణ్ కి మాస్ లో ఉన్న క్రేజ్ అండ్ ఆయన ఫ్యాన్స్ పుణ్యమా అని సినిమాకి రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే.. “బ్రహ్మోత్సవం” సినిమాకి కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా రాలేదు. కనీసం మహేష్ అభిమానులందరూ సినిమాని ఒక్కసారి చూసినా “సినిమా కలెక్షన్స్ లో సగం అయినా వచ్చేవి” అంటూ అప్పట్లో ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన ట్రోల్స్ మామూలుగా పేలలేదు. అవన్నీ దృష్టిలో పెట్టుకొనే మహేష్ బాబు నిన్న జరిగిన “స్పైడర్” ప్రీరిలీజ్ ఈవెంట్ లో కావాలనే “నా సినిమా నచ్చకపోతే మీరే చూడరు” అన్నాడని అర్ధమవుతోంది. మరి ఈ మెసేజ్ ను మహేష్ అభిమానులు అర్ధం చేసుకొన్నారో లేదో.