“వంశీ పైడిపల్లి నాకు కథ చెప్పి నాకోసం మూడేళ్లు వెయిట్ చేశాడు. కానీ.. కొందరు కథ చెప్పిన రెండు మూడు నెలలకే వేరే హీరోల దగ్గరకి వెళ్లిపోతున్నారు” అని మహేష్ బాబు నిన్న మహర్షి ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్ లెక్కలేనన్ని అనుమానాలకు తావు తీసింది. తొలుత మహేష్ ఏదో మామూలుగా అన్నాడు అనుకున్నారు కానీ.. వెంటనే అందరికీ సుకుమార్ ఉదంతం గుర్తుకొచ్చి.. మహేష్ బాబు కావాలని సుకుమార్ ని టార్గెట్ చేసి అలా అన్నాడని తెలిసొచ్చింది. నిన్న పూరీ జగన్నాధ్ పేరు మర్చిపోయిన విషయాన్ని వెంటనే గ్రహించి ట్విట్టర్ ద్వారా పూరీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన మహేష్ బాబు.. సుకుమార్ పేరు మాత్రం ఎక్కడా ఎత్తలేదు. పైగా.. నిన్నమొన్నటివరకూ “ఒన్ నేనొక్కడినే” సినిమా తన కెరీర్ లో స్పెషల్ ఫిలిమ్ అని చెప్పుకొచ్చిన మహేష్ నిన్న ఎక్కడా ఆ సినిమా పేరును మెన్షన్ చేయకపోవడం గమనార్హం.
అయితే.. సుకుమార్-మహేష్ కాంబినేషన్ కథను డెవలప్ చేయమని మహేష్ కోరగా.. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే సెట్స్ కి వెళదామని సుకుమార్ కోరాడు. ఆ గొడవ ఎంతకీ సర్ధుమణుగకపోవడంతో సుకుమార్ సైలెంట్ గా మహేష్ బాబు కాంపౌండ్ నుంచి బయటకొచ్చేసి బన్నీతో సినిమా ఎనౌన్స్ చేశాడు. ఆ విషయంలో మహేష్ అప్పుడు నార్మల్ గానే రెస్పాండ్ అయినప్పటికీ.. తర్వాత మాత్రం సుకుమార్ ను పెద్దగా పట్టించుకోలేదు. ఇక నిన్న ఈవెంట్ లో ఇండైరెక్ట్ గా రీటార్ట్ ఇవ్వడంతో సుకుమార్ చాలా ఇబ్బందిపడ్డాడని తెలుస్తోంది. ఏదైనా పంచ్ లు వేయడంలో మహేష్ మామూలోడు కాదుగా.