బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే ఘనంగా జరిగింది. నేటితో బిగ్ బాస్ 9 ఘనంగా ముగిసింది.15 మంది కంటెస్టెంట్లతో ఘనంగా ప్రారంభమైన ఈ సీజన్ … ఊహించని మలుపులతో సాగింది. ఊహించని ఎంట్రీలు , షాకింగ్ ఎలిమినేషన్లతో ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చాడు బిగ్ బాస్. ఫినాలే ఎపిసోడ్ కూడా అలాగే రసవత్తరంగా సాగింది.
టాప్ 5 లో తనూజ , కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యూల్, డీమోన్ పవన్ , సంజన గల్రాని వంటి వాళ్లు నిలిచారు. ఇక ఫినాలే లో ముందుగా సంజన ఎలిమినేట్ అయ్యింది. అటు తర్వాత ఇమ్మాన్యూల్ టాప్ 4 గా నిలిచాడు. ఇతన్ని కూడా టాప్ 3 లో ఊహించుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఈ క్రమంలో తనూజ, కళ్యాణ్, డీమోన్ పవన్..లు టాప్ 3 లో నిలిచారు. ఈ క్రమంలో ‘బిగ్ బాస్’ వీరికి రూ.15 లక్షల ఆఫర్ ఇచ్చాడు. ఆ మనీకి పవన్ ఓకే చెప్పేసి బయటకు వచ్చేశాడు. అలా అతను రూ.15 లక్షలు ప్రైజ్ మనీ గెలుచుకున్నట్టు అయ్యింది. అటు తర్వాత తనూజ, కళ్యాణ్..లలో ఎవరు విన్నర్ గా నిలుస్తారు అనే ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో కళ్యాణ్ పడాల నుండి విన్నర్ గా డిక్లర్ చేశారు. అయితే కళ్యాణ్ విన్నర్ అయినప్పటికీ అతనికి వచ్చే ప్రైజ్ మనీ రూ.35 లక్షలు మాత్రమే. ఎందుకంటే మధ్యలో డీమోన్ పవన్ రూ.15 లక్షలు పట్టుకుపోయాడు. వాస్తవానికి అతను టాప్ 3 వద్దే ఎలిమినేట్ అయిపోవాలి. కానీ బిగ్ బాస్ టాప్ 3 కి ఆఫర్ ఇవ్వడం జరిగింది. హీరో రవితేజను హౌస్లోకి పంపించి బిగ్ బాస్ ఈ ఆఫర్ ఇచ్చాడు. దానికి పవన్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు అనే చెప్పాలి. ఈ రకంగా బిగ్ బాస్ విన్నర్ అయిన కళ్యాణ్ పడాలకి పెద్ద షాక్ ఇచ్చాడు పవన్. గతంలో సోహైల్ వంటి వారు కూడా ఇలాంటి గేమ్ చేంజింగ్ డెసిషన్ తీసుకున్నారు.