Kalyan Padala: బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల.. షాకింగ్ ట్విస్ట్ ఇది!

బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది. 15 మంది కంటెస్టెంట్లతో ఘనంగా ప్రారంభమైన ఈ సీజన్ … మధ్యలో మరికొంతమంది కంటెస్టెంట్లు జాయిన్ అవ్వడం.. భరణి వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు మధ్యలో ఎలిమినేట్ అయ్యి.. మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడం .. ఇలా ఊహించని మలుపులతో సాగింది బిగ్ బాస్ 9. మొత్తానికి తనూజ , కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యూల్, డీమోన్ పవన్ , సంజన గల్రాని వంటి వాళ్లు నిలిచారు. ఇక ఫినాలే లో ముందుగా సంజన ఎలిమినేట్ అయ్యింది. ఆమె టాప్ 5 వరకు రావడం గొప్ప విషయమే.

Bigg Boss 9 Telugu Winner

వాస్తవానికి మొదట ఆమె మొదటి రెండు వారాలకే హౌస్ నుండీ బయటికి వచ్చేస్తుంది అని అనుకున్నారు. కానీ తర్వాత సింపతీ సంపాదించి గేమ్ లో కూడా ఇంప్రూవ్మెంట్ చూపించింది. అటు తర్వాత ఇమ్మాన్యూల్ టాప్ 4 గా నిలిచాడు. ఇతన్ని కూడా టాప్ 3 లో ఊహించుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఈ క్రమంలో తనూజ, కళ్యాణ్, డీమోన్ పవన్..లు టాప్ 3 లో నిలిచారు. ఈ క్రమంలో ‘బిగ్ బాస్’ వీరికి రూ.15 లక్షల ఆఫర్ ఇచ్చాడు. ఆ మనీకి పవన్ ఓకే చెప్పేసి బయటకు వచ్చేశాడు.

అలా అతను రూ.15 లక్షలు ప్రైజ్ మనీ గెలుచుకున్నట్టు అయ్యింది. అటు తర్వాత తనూజ, కళ్యాణ్..లలో ఎవరు విన్నర్ గా నిలుస్తారు అనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ పడాల నుండి విన్నర్ గా డిక్లర్ చేశారు. వాస్తవానికి అతని కంటే తనూజ ఓటింగ్లో ముందు వరసలో ఉండేది. కానీ చివర్లో తనూజ పై నెగిటివిటీ ఏర్పడింది. అది కళ్యాణ్ కి కలిసొచ్చినట్టు అయ్యింది.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ విన్నర్ కి దెబ్బేసిన డీమోన్ పవన్!

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus