నిజానికి ఈ చర్చ ఇప్పటిది కాదు.. రెండు సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ అయినప్పటి నుండి ఈ డిస్కషన్ నడుస్తోంది. ప్రతిసారి ఇద్దరిలో ఒకరు తగ్గుతారులే అనే కంక్లూషన్‌కి వచ్చి ముగించేస్తున్నారు. రోజులు, నెలలు గడుస్తున్నాయి కానీ.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు చూస్తుంటే రిలీజ్‌కి మూడు నెలలే ఉంది. అయినా ఇంకా ఏం క్లారిటీ రావడం లేదు. రాకపోగా ఇంకా కన్‌ఫ్యూజన్ పెరుగుతూ వస్తోంది. ఎందుకంటే రెండు సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో ఇంకా అదే పట్టుదలతో ఉన్నాయి.
మూడు నెలలు ఉంది, ఇద్దరూ ఒకే డేట్‌కి లాక్ అయ్యారు అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ డిస్కషన్ ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ సినిమాల గురించే అని. రామ్‌చరన్ – బుచ్చిబాబు సానా – జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘పెద్ది’. ఈ సినిమా కోసం పని చేసిన సాంకేతిక నిపుణులు చెబుతున్న మాటలు వింటుంటే ఈ సినిమా ఎవరూ ఊహించని రేంజిలో ఉంటుంది అని అర్థమవుతోంది. మరోవైపు ‘పెద్ది’ కాన్వాస్, కాన్సెప్ట్, కాంబో కూడా అంతే అంచనాలను క్రియేట్ చేసింది.
పెద్ది సినిమా మార్చి 27న విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. దీనికి తగ్గట్టుగా సినిమాను రెడీ చేస్తున్నారు. ఇక ‘ప్యారడైజ్’ సినిమా టీమ్ అయితే మార్చి 26 ఫిక్స్ అయిపోయాయి. అంటే ఒక రోజు గ్యాప్‌లో వస్తారు. ఇవన్నీ పాత మాటలు.. రీసెంట్‌గా ఎవరూ అనలేదు అనేగా మీ డౌట్. ‘ఛాంపియన్’ ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ మార్చి 27నే వస్తామని చెప్పాడు. ‘ప్యారడైజ్’ టీం అయితే సంపూర్ణేష్ బాబు లుక్ రిలీజ్ చేసి విడుదల తేదీని మరోసారి కన్ఫామ్ చేసింది.
రెండు సినిమాల హైప్, రేంజి వల్ల ఒకేసారి వస్తే థియేటర్ల దగ్గర ఇబ్బంది అయితే జరుగుతుంది. ఈ విషయంలో ఆ సినిమాల టీమ్‌లకు కూడా తెలుసు. కానీ రిలీజ్ డేట్ విషయంలో పట్టుబట్టి కూర్చున్నారు. అయితే ఇద్దరూ వస్తారా అంటే డౌటే అని చెబుతున్నారు. అయితే ఎవరు తగ్గుతారు అనేది చూడాలి.