యాక్షన్ చిత్రాలను సరికొత్తగా ఆవిష్కరించడంలో మురుగదాస్ దిట్ట. ఆయన చిత్రాల్లో హీరోలు చాలా ఫిట్ గా ఉంటారు. గజనిలో సూర్యతో పాటు, హిందీ గజినీలో అమీర్ ఖాన్ సిక్స్ ప్యాక్ లో అలరించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుని కూడా సిక్స్ ప్యాక్ లో చూపించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. స్పైడర్ మూవీతో ప్రిన్స్ తమిళంలో అడుగుపెట్టనున్నారు. తొలిసినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి మహేష్ చొక్కా విప్పక తప్పలేదని సమాచారం. సిక్స్ ప్యాక్ లో మహేష్ చూడాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ‘1 నేనొక్కడినే’ సినిమా సమయంలో సిక్స్ ప్యాక్ లో కనిపించడానికి ట్రై చేసిన మహేశ్ బాబు, బాత్ రూమ్ సన్నివేశంలో వీపు భాగం మాత్రమే చూపించారు.
ఆ తర్వాత బాడీని ఫిట్ గానే మైంటైన్ చేస్తూ స్పైడర్ మూవీకోసం సిక్స్ ప్యాక్ రప్పించినట్లు తెలిసింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో సూపర్ స్టార్ ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సో.. జేమ్స్ బ్యాండ్ తరహాలో ఫైట్స్ తో పాటు మహేష్ సిక్స్ ప్యాక్ ని స్పైడర్ మూవీ అభిమానులకు అందించనుంది అన్నమాట. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 23 న మూడు భాషల్లో రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.