Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

నాని నిర్మాణంలో ‘కోర్ట్’ (Court) అనే చిన్న సినిమా వచ్చింది. ప్రియదర్శి హీరోగా శివాజీ విలన్ గా నటించిన ఈ సినిమా మార్చి 14న రిలీజ్ అయ్యింది. విజయ్ బుల్గానిన్ సంగీతంలో రూపొందిన ‘కథలెన్నో’ అనే పాట సినిమాకి హైప్ తీసుకొచ్చింది.అలాగే నిర్మాత నాని ‘ఈ సినిమా కనుక మీకు నచ్చకపోతే.. నెక్స్ట్ వచ్చే నా ‘హిట్ 3′ ని ఎవ్వరూ చూడకండి’ అంటూ డేరింగ్ కామెంట్స్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ‘కోర్ట్’ పై నానికి ఉన్న కాన్ఫిడెన్స్ చూసి.. థియేటర్ కి వెళ్లారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది.

Court Collections:

2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఆ తర్వాత కూడా బాగా పెర్ఫార్మ్ చేసింది. శివాజీ పోషించిన మంగపతి పాత్ర సినిమాకే హైలెట్ అయ్యింది అని చెప్పాలి. ఒకసారి ‘కోర్ట్’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 9.25 cr
సీడెడ్  1.72 cr
ఆంధ్ర(టోటల్) 7.6 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 18.57 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 6.5 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 25.07 cr (షేర్)
‘కోర్ట్’ సినిమాకు రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఫుల్ రన్లో ఏకంగా రూ.25.07 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.46 కోట్ల వరకు కొల్లగొట్టింది. బయ్యర్స్ కి ఈ సినిమా ఏకంగా రూ.17.5 కోట్ల వరకు ప్రాఫిట్స్ అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags