‘తమ్ముడు’ (Thammudu) సినిమా ప్రచారంలో భాగంగా ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), శిరీష్ వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ల రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సమయంలో కూడా ఈ స్థాయిలో ఇంటర్వ్యూలు ఇవ్వడం, మీడియా ముందుకు రావడం లాంటివి జరగలేదు. ఎందుకో కానీ ఇప్పుడు ప్రచారంలో వరుసగా దిల్ రాజు కనిపిస్తున్నారు. చాలా తక్కువగా మీడియా ముందుకొచ్చే ఆయన సోదరుడు శిరీష్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రస్తావన వచ్చింది. అప్పుడు శిరీష్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా రామ్‌చరణ్ (Ram Charan) కెరీర్‌లో పెద్ద డిజాస్టర్ అని చెప్పొచ్చు. అలాంటి సినిమా ఇచ్చిన నిర్మాత దిల్ రాజు విషయంలో చరణ్ ఫ్యాన్స్ ఏమంత హ్యాపీగా లేరు. సినిమా కథ ముందు బయటకు వచ్చేయడం, సన్నివేశాలు, ప్లాట్‌లు, ట్విస్ట్‌లు సినిమా రిలీజ్‌కి ముందే సోషల్ మీడియాలో కనిపించాయి. ఇక పైరసీ ప్రింట్ అయితే తొలి షో పడగానే బయటకు వచ్చేసింది. దీంతో ఈ సినిమా విషయంలో నిర్మాణ సంస్థ జాగ్రత్తలు తీసుకోలేదని చరణ్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.
అయితే ఈ సినిమా విషయంలో హీరో పట్ల నిర్మాతలు కూడా హ్యాపీగా లేరు. సినిమా పోయిన తర్వాత హీరో తమను కనీసం పట్టించుకోలేదని, కర్టసీ కాల్ కూడా చేయలేదని నిర్మాత శిరీష్ (Sirish) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దర్శకుడు కూడా తమను పట్టించుకోలేదని శిరీష్ అనడం గమనార్హం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మళ్లీ మేం నార్మల్సీకి వచ్చామని.. అదే లేకపోతే మా పరిస్థితి ఏమిటో తెలియడం లేదు అని అన్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని కూడా అన్నారు.
‘‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ అయ్యిందని హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్ వచ్చి ఏమైనా హెల్ప్ చేశాడా? కర్టసీకి ఫోన్ కూడా చేయలేదు’’ అని శిరీష్ అన్నారు. తమకు ఇష్టమై ఆ సినిమా చేశామని, డబ్బులు పోగొట్టుకున్నామని కూడా శిరీష్ అన్నారు. అయితే ఇక్కడ ఒకటే డౌట్ అంతలా పట్టించుకోని హీరోతో మరో సినిమా చేస్తామని దిల్ రాజు ఎలా అన్నారో ఏంటో?
Game Changer Tho Maa Brathuku Ipoyindhi Anukunnam But Sankranthi Vastunnam Tho Hopes Vachayi.
GC Loss Hero, Director Evaru Pattinchukoledhu – Sirish Garu. pic.twitter.com/Faw7ka52WQ
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) June 30, 2025