Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు పవన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఎదిగారు. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి దిల్ రాజు భార్య తేజస్విని (Tejaswini) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. దిల్ రాజులానే ఆమె కూడా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.

Dil Raju Wife Tejaswini

దిల్ రాజు భార్య తేజస్విని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ “మా వివాహం తర్వాత ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ కి వెళ్ళాము. నేను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారికి వీరాభిమానిని. చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆడియో క్యాసెట్స్ రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫేస్ చూసి ‘ఈయన భలే ఉంటాడు అనుకునే దాన్ని. ఆ టైంకి ఆయన ఏజ్ ఎంతో తెలీదు.

అప్పుడు మనకి ఆయన్ని ఎలా కలవాలో తెలీదు. కానీ మన సినిమాలో నటిస్తున్నప్పుడు ఈయన్ని(దిల్ రాజు) అడిగేదాన్ని. పవన్ గారిని కలవాలి అని. నాలో ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతారు కదా. ఈయనేమో ‘నేను ఒకసారి అడుగుతాను.. ఇబ్బంది పెట్టకు’ అనేవారు. ఫైనల్లీ తీసుకెళ్లారు కలిశాను. ఆ తర్వాత సినిమా చూసిన తర్వాత కూడా కలిసి సినిమాలో ఉన్న ఎమోషనల్ సీన్స్ గురించి చెప్పాను.

ఆయన కూడా ఎమోషనల్ అయ్యి.. మీ లాంటి ఆడబిడ్డలు అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు ఎదుటి వాళ్ళు ఒక సమస్య గురించి చెబితే.. వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తారు. అది తన సమస్య అని ఫీల్ అవుతారు.అందరి బాధని ఫీలవుతారు కాబట్టే.. ఆయన మైక్ పట్టుకున్నప్పుడు అంత అగ్రెసివ్ గా మాట్లాడతారు. అది ఆయన నిజాయితీ” అంటూ చెప్పుకొచ్చారు.

 

 

ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus