చాలా గ్యాప్ తర్వాత రిపీట్ కాబోతున్న మహేష్ – త్రివిక్రమ్ కాంబో..!

  • April 2, 2019 / 06:46 PM IST

మహేష్ బాబు – త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ కోసం కేవలం మహేష్ అభిమానులు మాత్రమే కాదు టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. అలా ఈ కాంబినేషన్లో ఓ ఇండస్ట్రీ హిట్టో లేక బ్లాక్ బస్టరో రాలేదు. కానీ వీరిద్దరి కాంబినేషన్ నుండీ ఓ కొత్త ఫీల్ ఆడియన్స్ కు అందుతుంది. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ చిత్రం పర్వాలేదనిపించినా , ‘ఖలేజా’ మాత్రం డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికీ ఈ చిత్రాలని టీవీల్లో ప్రసారం చేస్తే… అది వీక్ డేస్ లో ప్రసారం చేసినా సరే మంచి టి.ఆర్.పి రేటింగ్ నమోదుచేస్తుండడం విశేషం.

అయితే త్వరలోనే మరోసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారట. అదేంటి ఓ పక్క మహేష్ వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేస్తూ బిజీగా ఉన్నాడు.. అలాగే త్రివిక్రమ్ కూడా బన్నీ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు… తరువాత మెగాస్టార్ తో కూడా ఓ సినిమా ఉంది… ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఎలా పనిచేస్తారు అనేగా మీ డౌట్..? అయితే వీళ్ళిద్దరూ పనిచేసేది సినిమా కోసం కదండీ.. ఓ యాడ్ కోసం..! త్వరలోనే మహేష్ బాబుని పెట్టి ఓ యాడ్ ఫిల్మ్ ను షూట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. గతంలో త్రివిక్రమ్ చాలా మంది స్టార్ హీరోల కమర్షియల్ యాడ్స్ ను డైరెక్ట్ చేశాడు. ఇక మహేష్ తో అయితే చాలా యాడ్స్ డైరెక్ట్ చేసాడు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి… మహేష్ తో ఓ యాడ్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. ఇదొక యాప్ కు సంబంధించిన యాడ్ అని తెలుస్తుంది. ఈ నెల 10 నుండీ ఈ యాడ్ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus