”గూఢచారి” చిత్రం గురించి మహేష్ ఏమన్నారంటే?

  • August 7, 2018 / 03:52 PM IST

క్షణం తర్వాత అడవి శేష్ వద్దకు ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ.. తొందరపడి, రెమ్యునరేషన్ కి ఆశపడి నిర్ణయం తీసుకోలేదు. సినీ ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యే కథను రాసుకొని ముందుగానే హిట్ ని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. దానికి తన ప్రతిభని జోడించి అందరితో అభినందనలు అందుకుంటున్నారు. యువ దర్శకుడు శశికాంత్‌ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన గూఢచారి గత శుక్రవారం రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకం పై అభిషేక్‌ నామా నిర్మించిన ఈ సినిమా ఈ చిత్రం మూడు రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) ప్రపంచవ్యాప్తంగా 4.39 కోట్ల షేర్ రాబట్టింది.

ఓవర్ సీస్ లో అయితే వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడానికి దూసుకుపోతోంది.  తాజాగా ఈ సినిమాని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర బృందాన్ని ట్విట్టర్ వేదికపై ప్రశంసించారు. “తెలుగులో స్పై థిల్లర్ కథను ప్రయత్నించిన గూఢచారి బృందం అందరినీ మెప్పించింది. కథ, కథనం చాలా వేగంగా, ఉత్కంఠంగా సాగింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ చక్కగా నటించారు. అడవి శేషు అయితే అన్నివిధాలుగా ఆకట్టుకున్నారు.” అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. మహేష్ కామెంట్ కి “గూఢచారి” బృందం ఆనంద పడుతోంది. మహేష్  ట్వీట్ సినిమా కలక్షన్స్  పెరగడానికి దోహదం చేస్తుందని సినీ ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus