‘డ్యాంగ్ డ్యాంగ్ ‘ పాటకు స్టెప్పులతో ఇరగదీసిన మహేష్ కూతురు..!

ఈ సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా రోజుల తర్వాత మహేష్ ను మాస్ యాంగిల్ లో చూపించడమే కాదు.. ఎంతో ఎనర్జిటిక్ గా ప్రెజెంట్ చేసి.. ఫ్యాన్స్ ను మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కు రప్పించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’ లోని ‘డ్యాంగ్ డ్యాంగ్’ పాట ఎంత హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా రోజుల తర్వాత డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు మహేష్. అయితే తాజగా ఈ పాటకు మహేష్ కూతురు స్టెప్పులతో ఇరక్కొట్టింది.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చిన్న పిల్లైనా సితార పాప ఎనర్జీ చేసుతుంటే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ ప్రేక్షకుల్లో కొన్ని సందేహాలు కూడా మొదలవుతున్నాయి. ఎప్పుడూ సితార పాప డ్యాన్స్ వీడియోలనే మహేష్ కానీ.. ఆయన సతీమణి నమ్రత కానీ పోస్ట్ చేస్తుంటారు. కానీ వారి కుమారుడు గౌతమ్ కు సంబంధించి ఇలాంటి వీడియోలు ఎందుకు షేర్ చెయ్యరు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గౌతమ్ కు అస్సలు నటన పై ఇంట్రెస్ట్ లేదా.. లేక ఆయన్ని హీరోగా పరిచయం చేసే వరకూ వీటికి దూరంగా ఉంచాలనుకుంటున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైతేనేం.. సితార పాప డ్యాన్స్ వీడియోని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus