మహేష్ కొత్త సినిమా లుక్ సూపర్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు పగలు, రాత్రి అని తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. తమిళ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం నైట్ షూట్ లో నటిస్తున్నారు. మహేష్ గత మూవీ బ్రహ్మోత్సవం ఆశించినంత విజయం సాధించక పోవడంతో ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి తో శ్రమిస్తున్నారు. ఇందుకోసం ప్రిన్స్ పూర్తిగా లుక్ మార్చారని, గడ్డంతో కనిపిస్తారని వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ నిజం కాదని తాజా ఫోటో తేల్చి చెప్పింది.

అన్నపూర్ణ స్టూడియోలో వేసిన మురికివాడల సెట్ లో రాత్రివేళ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో అభిమానులు తీసిన సూపర్ స్టార్ ఫోటో ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తుంది. అందులో మహేష్  షేవ్ తో ఉన్నారు. వైట్ షర్ట్ వేసుకుని క్లాస్ లుక్ తో అదరగొట్టారు. దీంతో కొత్త చిత్రంలో ప్రిన్స్ లుక్ పై ఉన్న అన్ని అనుమానాలను ఈ ఫోటో తొలిగించింది. తనదైన స్టయిల్ తోనే సూపర్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్ ల్లో నటిస్తున్నట్లు ఖరారు అయింది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ మరో వారం రోజుల పాటు హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఆ తర్వాత చిత్ర బృందం చైన్నైకి వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus