దక్షిణాది భాషల్లో సత్తా చూపనున్న సూపర్ స్టార్

సాహసాలు చేయడానికే కాదు.. మల్టీ స్టారర్ సినిమాలకు తాను ముందుంటానని సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడో చెప్పారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ కి తమ్ముడిగా నటించి చేసి చూపించారు. ఇప్పుడు మరో భారీ మల్టీ స్టారర్ మూవీలో ప్రిన్స్ నటించనున్నట్లు సమాచారం. చంద్రకళ, కళావతి వంటి సినిమాలను తెరకెక్కించిన తమిళ దర్శకుడు సుందర్ దక్షిణాది భాషల్లో భారీ మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన టాప్ హీరోలు నటించనున్నారు. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు ని ఎంపిక చేసినట్లు తెలిసింది.

కోలీవుడ్ నుంచి జయం రవి నటించడం ఖరారు అయింది. ఇక శాండిల్ వుడ్, మల్లూవుడ్ నుంచి స్టార్ హీరోలను  ఎంచుకోవడానికి దర్శకుడు సంప్రదింపులు చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీకి ‘సంఘమిత్ర’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. కమర్షియల్ డైరక్టర్ ఏఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో కోలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ బాబు, ఈ మల్టీ స్టారర్ మూవీతో దక్షిణాది అన్ని భాషల్లో తన సత్తా చూపించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus