టాలీవుడ్ లో టాప్ హీరోలకు…చిన్న హీరోలకు వారధిగా….యువ హీరోలా మారిపోయాడు మన న్యాచురల్ స్టార్ నాని. అయితే అదే క్రమంలో చాల్ డీసెంట్ సినిమాలు చేసుకుంటూ, హిట్స్ తో దూసుకుపోతున్నాడు….వరుసగా నాలుగు హిట్స్ సాధించిన నాని, మజ్నుతో మళ్లీ ప్రేక్షకులకు పలకరించాడు. ఇదిలా ఉంటే…తన గత సినిమా జెంటిల్ మన్ విషయమే తీసుకుంటే…ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా ఓ మోస్తరుగానే వచ్చాయి. వెంటనే వసూళ్లు డ్రాప్ కావడం, అదే క్రమంలో రెండో వారం వచ్చే సరికి పుంజుకోవడం ఇలా అన్నీ వెరసి ఆ సినిమాను సూపర్ హిట్ చెయ్యడమే కాకుండా…కలెక్షన్స్ పరంగానూ సినిమాను మంచి పొసిషన్ లో నిలిపింది.
అయితే అదే తరహాలో ఇప్పుడు నడుస్తున్న నాని “మజ్ను” సెట్ కాలేదు…టాక్ అయితే గుడ్ అనే వచ్చింది కానీ…వసూళ్ల పరంగా, ఓపెనింగ్స్ పరంగా కాస్త నిరాశే మిగిలింది అనే చెప్పాలి. ఇంకా చెప్పాలి అంటే…వరుసగా నాలుగు హిట్లు కొట్టిన హీరోకు రావాల్సిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు ఈ సినిమాకి. అంతేకాకుండా వీకెండ్ తర్వాత వసూళ్లు డ్రాప్ అయ్యాయి కూడా….ఇక వసూళ్ల లెక్కలు చూసుకుంటే…ఇప్పటిదాకా ‘మజ్ను’ రూ.10 కోట్ల దాకా వసూళ్లు సాధించిందని అంచనా. ఇంతవరకూ పక్కన పెడితే అసలు కధ ఇక్కడే మొదలయింది…వీకెండ్లో ‘హైపర్’తో పాటు ‘ఎం.ఎస్.ధోని’ కూడా రిలీజ్ కావడం..అంతేకాకుండా ఆ తర్వాతి వారం అయితే ఏకంగా ఐదు సినిమాలు విడుదలకు సిద్దం కావడం చూస్తుంటే జెంటిల్ మన్ కి ఉన్నంత స్కోప్ మజ్ను కి లేదు అనే చెప్పాలి…ఒక రకంగా చెప్పాలి అంటే మజ్ను యావరేజ్ సినిమాగా మిగిలిపోక తప్పదు.
https://www.youtube.com/watch?v=9H3qWaIbnF4