నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం ఆ వంశం అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. అదే ఫ్యామిలీ నుండి వచ్చి స్టార్ హీరోగా ఉన్న వారిలా మోక్షు కూడా ఎర్లీ ఏజ్‌లోనే సినిమాల్లోకి వస్తాడు అని అనుకున్నారంతా. నూనూగు మీసాల మోక్షును సినిమాల్లో చూసి మురిసిపోదాం అనుకున్నారు. కానీ 30 దాటినా ఇంకా ఆయన అరంగేట్రం కాలేదు. ఇదిగో, అదిగో అంటూ గత కొన్నేళ్లుగా చెబుతూనే ఉన్నారు. దానికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నా.. అసలు కారణం ఇదీ అంటూ మరోసారి మేకోవర్ గురించి చర్చ మొదలైంది.
ఇటీవల బాలకృష్ణ కుటుంబంలో ఓ శుభకార్యం జరిగింది. దానికి కుటుంబసభ్యులు అందరూ హాజరయ్యారు. అందులో మోక్షు కూడా ఉన్నాడు. ఉంటాడు కూడా. అయితే ఫొటోల్లో అతన్ని చూశాక.. ఇంకా మేకోవర్ పూర్తవ్వలేదు అనిపిస్తోంది. అంటే సగటు కుర్రాడిలా నార్మల్‌గా కనిపించాడు. సినిమా లాంచ్‌కి రెడీ అవుతున్న హీరోలా ఎక్కడా ఫేస్ కనిపించలేదు. దీంతో మేకోవర్ కోసమే సినిమా ఇంకా స్టార్ట్ చేయడం లేదు అని గత కొన్ని నెలలుగా వస్తున్న పుకార్లు నిజమేమో అనిపిస్తోంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా అనౌన్స్ అయింది. రేపో మాపో సినిమాకు కొబ్బరికాయ కొడతారు అనగా.. ఆరోగ్యం బాలేదు అంటూ వాయిదా వేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఆ సినిమా ఉందో లేదో చెప్పడం లేదు. లేదని మనం అనేసుకోవచ్చు. ఆ లెక్కన ప్రాజెక్ట్‌తో అయినా సమస్య ఉండాలి. లేదంటే ఆ ప్రాజెక్ట్‌కి హీరో ఇంకా రెడీ అవ్వలేదు కోవాలి అని లెక్కలేసుకున్నారు. కానీ మేకోవర్ పెండింగ్ వల్ల లాంచ్ అవ్వలేదు అని లేటెస్ట్ ఫొటోలు చెబుతున్నాయి.
మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ‘ఆదిత్య 999 మ్యాక్స్’ ద్వారా మోక్షు ఎంట్రీ ఉంటుందని టాక్. అయితే క్రిష్ వేరే సినిమా స్టార్ట్ చేసేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ కూడా లేదు. మరి బాలయ్యనే తన కొడుకుని లాంచ్ చేస్తారేమో చూడాలి. అన్నట్లు ఆ మధ్య ఈ మాట కూడా ఆయన నోట వినిపించింది. నందమూరి తారకరామారావులా బాలయ్య కూడా తన వారసుడి అరంగేట్రం చేయాలని చూస్తున్నారేమో. అదే అవుతుందేమో.