Salaar 2: ‘సలార్ 2 ‘ పై అవన్నీ రూమర్సేనా.. మేటర్ ఏంటి?

ప్రభాస్ (Prabhas)  – ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  కాంబినేషన్లో రూపొందిన ‘సలార్’ (Salaar) చిత్రం మంచి సక్సెస్ అయ్యింది. ప్లాపుల్లో ఉన్న ప్రభాస్ కి, అతని అభిమానులకు కొంత రిలీఫ్ ఇచ్చింది. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘డంకీ’ (Dunki) తో పోటీపడి మరీ రూ.700 కోట్లు కలెక్ట్ చేసింది. వేరే టైంలో కనుక రిలీజ్ అయ్యుంటే ‘సలార్’ రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా దాటేసేది అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా.. ‘సలార్’ కి సెకండ్ పార్ట్ ఉంటుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు.

‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం’ టైటిల్ తో ఈ ప్రాజెక్టు ఉంటుందని ప్రకటించారు. జనాల్లో కూడా ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం’ పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ‘సలార్ 2’ గురించి ఇప్పుడు కొన్ని రూమర్స్ షికారు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని.. ‘ప్రభాస్, ప్రశాంత్ నీల్..ల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్’ వచ్చాయనేది ఆ వార్త సారాంశం. అయితే ఈ విషయం పై నిర్మాతలైన ‘హోంబలే ఫిలింస్’ వారిని సంప్రదించగా..

‘ఆ వార్తల్లో నిజం లేదు.. కచ్చితంగా ‘సలార్ 2 ‘ ఉంటుంది..! ఆల్రెడీ సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేశాం. మిగిలిన ఆర్టిస్ట్..ల డేట్స్ వల్ల షూటింగ్ కొంచెం డిలే అవుతుంది తప్ప.. ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు. మరోపక్క ప్రభాస్ కి ‘బాగా ఇష్టమైన దర్శకుడు ప్రశాంత్ నీల్ అని, అతనితో వర్క్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశానని’ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus