Pushpa 2: పుష్ప 2: 1000 కోట్లు కొట్టాలంటే ఇదే పర్ఫెక్ట్ ప్లాన్.!

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పుష్పరాజ్ తన ఆధిపత్యాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఫస్ట్ పార్ట్ తో ఎలాంటి అంచనాలు లేకుండానే నార్త్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో అందరికీ షాక్ ఇచ్చాడు. అసలు పుష్ప 1 ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపిస్తుందని ఎవరు ఊహించలేదు. ఇక ఆ సినిమా గ్రాండ్ గా సక్సెస్ కావడంతో బాలీవుడ్ లో పుష్ప (Pushpa 2) సెకండ్ పార్ట్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

Pushpa 2

ఇప్పటికే బిజినెస్ కూడా ఊహించని రేంజ్ లోనే జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాతో ఎలాగైనా 1000 కోట్ల క్లబ్లో చేరాలి అని మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. విడుదల విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈసారి వాయిదా కాకుండా అనుకున్న డేట్ కంటే ముందుగానే రాబోతున్నారు. డిసెంబర్ 6న సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు.

అయితే ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా 4వ తేదీ రాత్రి 9 గంటలకు ముంబై లో ఒక ప్రీమియర్ షోను ప్రదర్శించనున్నారు. ఇక మరుసటి రోజు రాత్రి ఒంటిగంట నుంచి తెలుగు రాష్ట్రాల్లో పుష్ప రాజ్ జాతర మొదలు కాబోతోంది. 1000 కోట్లు అందుకోవాలి అంటే ఈమాత్రం ప్రణాళిక తప్పనిసరిగా అవసరం. ముఖ్యంగా ముంబైలోనే ఒక భారీ ఈవెంట్ నిర్వహించాలని కూడా మేకర్స్ ఆలోచిస్తూ ఉన్నారు.

అక్కడే ట్రైలర్ ను కూడా విడుదల చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కూడా పుష్ప 2 (Pushpa 2) సినిమా వెయ్యి కోట్లు మార్క్ ను అందుకోగలదని ధీమాగా ఉన్నారు. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus