Malaika Arora: విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మలైకా అరోరా!

  • December 7, 2022 / 07:02 PM IST

టీవీ వ్యాఖ్యాతగా, నటిగా, మోడల్ గా, నృత్య కళాకారిణిగా మలైకా అరోరా పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని థానేలో జన్మించిన మలైకా అరోరా ఫిట్ నెస్ స్టార్ గా మంచి పేరును సంపాదించుకున్నారు. ఛయ్యా ఛయ్యా అనే సాంగ్ ద్వారా మలైకా అరోరాకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఐదుగురు హీరోయిన్లు రిజెక్ట్ చేసిన పాటలో నటించి మలైకా అరోరా ప్రశంసలు అందుకున్నారు. మంచి డ్యాన్సర్ కావడంతో మలైకాకు ఈ సాంగ్ లో చేసే అదృష్టం దక్కింది.

అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకోవడం గురించి మలైకా స్పందిస్తూ లైఫ్ లో తాను విభిన్నమైన విషయాలను కోరుకున్నానని ఆమె అన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన ఉండటం వల్లే నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే లైఫ్ లో భిన్నమైన అంశాలను కోరుకోవడం వల్లే తాను భర్తతో విడిపోయానని ఆమె పేర్కొన్నారు. అర్భాజ్ ఖాన్ నన్ను ఓ వ్యక్తిగా మార్చాడని ఆమె తెలిపారు. అర్భాజ్ ఖాన్ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నానని మలైకా అరోరా కామెంట్లు చేశారు.

నేను కూడా విభిన్నమైన విషయాలను కోరుకోవడంతో లైఫ్ ఎక్కడో గాడి తప్పినట్టు అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. అయినా నేను ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కొన్ని బంధాలను వదులుకోగలిగితే అలా చేయగలనని భావించి చేశానని మలైకా అరోరా అన్నారు. ప్రస్తుతం మలైకా అరోరా అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ జోడీకి ప్రత్యేక స్థానం ఉంది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుందని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ జోడీ గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయనే సంగతి తెలిసిందే.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus