Malavika: ఫ్యాన్స్‌తో మాట్లాడిన మాళవిక… చాలా విషయాలే చెప్పిందిగా!

  • October 5, 2023 / 12:36 PM IST

టాలీవుడ్‌లో సినిమా చేయకపోయినా ఓ సినిమాలో నటిస్తోంది అనే వార్తతో తెలుగు పరిశ్రమలో హాట్‌ బ్యూటీ అయిపోయింది మాళవిక మోహనన్‌. విజయ్‌ ‘మాస్టర్‌’ సినిమాలో ఆమె నటించినా.. పెద్దగా ఉపయోగపడే పాత్ర కాదు ఆమెకు. అయితే ప్రభాస్‌ – మారుతి సినిమాలో ఆమె నటిస్తోంది అనే పుకారు రావడం ఆలస్యం వైరల్‌ అయిపోయింది. ఇప్పుడు మన హీరోయిన్‌ అయిపోయింది. ఇటీవల ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

నెటిజన్లు అడిగిన ప్రశ్నల్లో కొన్ని కామన్‌గా వినిపించేవి ఉంటే, కొన్ని వైరల్‌ అయ్యేవి ఉన్నాయి. ప్రస్తుతం భారతీయ సినిమాలో పెద్ద చర్చ ‘సలార్‌’ వర్సెస్‌ ‘డుంకీ’. ఓ నెటిజన్‌ ఈ విషయమే అడిగాడు. రెండు సినిమాలు ఒకే రోజు వస్తే ఏది చూస్తారు అని మాళవికను అడిగితే.. చాలా జాగ్రత్తగా రెండూ చూడాలని ఉంది అని చెప్పింది. అయితే ఏదో ఒక్కటే ఎంపిక చేసుకోమంటే ‘సలార్‌’ చూస్తానని చెప్పింది. దానికి కారణం అని అడుగుతారేమో సినిమా టీజర్‌ నాకు బాగా నచ్చింది అని చెప్పేసింది.

ఇక బాగా నచ్చిన పాత్ర గురించి చెప్పమంటే.. చియాన్‌ విక్రమ్‌ సరసన నటిస్తున్న ‘తంగలాన్‌’ గురించి చెప్పింది. ఇందులో ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని పోస్టర్లు చూస్తేనే తెలుస్తోంది. ఇక ఫుడ్‌ సంగతేంటి అని అడిగితే.. ఫిష్‌ ఫ్రై, ఫిష్‌ కర్రీ అని క్లారిటీ ఇచ్చింది. అయితే అది అమ్మ చేసిన వంట అయితేనే అని షరతు పెట్టింది. అన్నట్లు ‘తంగలాన్‌’ రిలీజ్‌ గురించి అడిగితే… ఆ విషయం నన్ను కాదు దర్శకుడు పా. రంజిత్‌ని అడగండి అంటూ గడుసు సమాధానం చెప్పింది.

బైక్స్‌ అంటే బాగా ఇష్టమని చెప్పిన (Malavika) మాళవిక… అలా ఇష్టపడేవాళ్లు అజిత్‌ను కూడా ఇష్టపడతారని లాజిక్‌ చెప్పింది. అయితే అదేంటో, ఎలాగో చెప్పలేదు. విజయ్‌ ‘మాస్టర్‌’తో వచ్చారు కదా.. ఆ సినిమా కాకుండా విజయ్‌ సినిమాల్లో ఏది ఇష్టం అంటే ‘తెరి’ అని పలికింది మలయాళ ముద్దుగుమ్మ.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus