Malavika Mohanan: మీకెందుకు తొందర.. నేను చెప్తాగా? మాళవిక మోహనన్‌ కౌంటర్‌

అందగత్తెను భయపెట్టేలా మార్చి తెరకెక్కించిన ఓ సినిమా ఆగస్టు 15న రిలీజ్‌ అవుతోంది. మామూలుగా అయితే ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉంటాయి. అయితే ఏమైందో ఏమో గత కొన్ని రోజులుగా లేని పోని చర్చలు జరుగుతున్నాయి. సినిమా మీద వాళ్లకే నమ్మకం లేదు అని కూడా అంటున్నారు. ఆ సినిమానే ‘తంగలాన్‌’ (Thangalaan) . విక్రమ్‌ (Vikram) , మాళవిక మోహనన్‌  (Malavika Mohanan) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతోంది.

ఈ నేపథ్యంలో ఆమె సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. సినిమాల విశేషాలతోపాటు, వ్యక్తిగత విశేషాలను కూడా షేర్‌ చేసుకుంది. ఇప్పుడు ఆ విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ఓ విషయం ఆమె పెళ్లి. ‘మీ పెళ్లి ఎప్పుడు?’ అని ఒక నెటిజన్‌ ఆమను అడగ్గా ‘‘నా పెళ్లి చూడాలనే తొందర మీకు ఎందుకు?’ అని మాళవిక తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ‘తంగలాన్‌’ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పండి అని అంటే..

సినిమా అదిరిపోతుంది అని సమాధానం ఇచ్చింది. తమిళంలో నెక్స్ట్‌ ఏ సినిమా చేస్తున్నారు అని అంటే.. ఆ వివరాలు త్వరలో చెబుతా అని అంది. విక్రమ్‌తో నటించడం ఎలా ఉంది అని అంటే.. ఆయన అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్పింది. అంతేకాదు ‘తంగలాన్‌’ సినిమా కోసం కోసం తొలిసారి స్టంట్స్‌ చేశానని, అది విక్రమ్‌ వల్లే సాధ్యమైందని చెప్పింది మాళవిక. మీరు చూసిన లేటెస్ట్‌ టీవీ సిరీస్‌ ఏంటి అని అడిగితే.. ‘లెసన్స్‌ ఇన్‌ కెమిస్ట్రీ’ అనే పేరు చెప్పింది.

మీ డ్రీమ్‌ రోల్‌ ఏంటి అని అడిగితే.. గతంలో చెప్పినట్లే గ్యాంగ్‌స్టర్‌గా నటించడం నా కోరిక అని చెప్పింది. మరి ఫైట్‌ అంటే ఇష్టమా? లేక డ్యాన్స్‌ అంటే ఇష్టమా అని అడిగితే నాకు ఎప్పుడూ ఫైట్‌ చేయడమే ఇష్టం అని మనసులో మాట చెప్పేసింది. మరి ఆమెకు ఇప్పుడు యాక్షన్‌ రోల్‌, సినిమా ఎవరిస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus