Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

చేతిలో ఓ సినిమా ఉంది. షూటింగ్‌ పూర్తయినా.. వివిధ కారణాల వల్ల ఆ సినిమా విడుదల కావడం లేదు. అసలు ఎప్పుడు విడుదల అవుతుంది అనేది కూడా తెలియడం లేదు. రేపు, మాపు అంటున్నారు తప్ప విడుదల వైబ్స్‌ అస్సలు రావడం లేదు. ఆ డైరక్టర్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు అనుకుంటే.. ఇప్పుడు నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు అనే సమాచారం బయటకు వచ్చింది. అ దర్శకుడే మల్లిడి వశిష్ట. ఆయన చేతిలో ఉన్న సినిమా చిరంజీవి ‘విశ్వంభర’.

Malladi Vasista

ఇప్పుడు ఆయన కొత్త కథ సిద్ధం చేసుకొని చెప్పిన స్టార్‌ హీరో వెంకటేశ్‌. ప్రస్తుతం వెంకటేశ్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం: హౌస్‌ నెం 47’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌తో చేయనున్న మల్టీస్టారర్‌ సినిమాకి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ తర్వాతి కథను ఓకే చేసే పనిలో పడ్డాడట వెంకటేశ్‌. ఈ క్రమంలోనే సురేశ్‌బాబుకు వశిష్ట కథ లైన్‌ చెప్పారట.

సురేశ్‌ బాబుకు లైన్‌ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధం చేసి వెంకటేశ్‌కి చెప్పమని సూచించారట. దీంతో ఇప్పుడు వశిష్ట అదే పనిలో ఉన్నారట. ఆ స్టోరీ సిట్టింగ్‌ అయ్యాక సినిమాపై ఫైనల్‌ డెసిషన్‌ తీసుకునే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మొదలైంది. ఆ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో సమస్యల వల్ల ఆలస్యమవుతూ వస్తోందని వార్తలొస్తున్నాయి. టీజర్‌ రిలీజ్‌ వరకు ఉన్న సినిమా మీద ఉన్న హైప్‌ ఒక్కసారిగా ఆగిపోయింది.

దాంతో సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో మరోసారి టీమ్‌ కూర్చుంది. చాలా నెలలుగా ఈ విషయంలో పనులు జరుగుతున్నా ఎక్కడో హీరో చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేయడం లేదు అనే వార్తలొస్తున్నాయి. దీనికి ఇప్పుడు వశిష్ట కొత్త సినిమా ఓకే చేసుకోవడానికి ఏమన్నా రిలేషన్‌ ఉందేమో తెలియాల్సి ఉంది.

‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus