Malli Pelli: ‘మళ్ళీ పెళ్లి’ కి నెగిటివ్ పబ్లిసిటీ అలా కలిసొచ్చిందన్న మాట!

  • May 25, 2023 / 03:18 PM IST

నరేష్, పవిత్ర లోకేష్.. లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. టీజర్, ట్రైలర్ సినిమా పై ఆసక్తిని కలిగించాయి. ట్రైలర్ చూసిన వాళ్లంతా ఇది వాళ్ళ బయోపిక్ అని ముచ్చటించుకుంటున్నారు. నరేష్, పవిత్ర కలిసి జీవిస్తుండడం.. అలాగే ఇంకో పెళ్లి చేసుకోవాలి అనుకోవడం, మధ్యలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అడ్డుపడటం వంటి వ్యవహారాలు వార్తలకెక్కడం అందరూ చూశారు.ఒకానొక టైంలో వీళ్ళు మైసూర్ లోని హోటల్ గదిలో ఉన్నప్పుడు రమ్య మీడియాని వెంటేసుకుని వెళ్లి పెద్ద రచ్చే చేసింది.

ఆ విజువల్స్ అన్నీ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అవన్నీ (Malli Pelli) ‘మళ్ళీ పెళ్లి’ ట్రైలర్ లో కనిపించాయి. రమ్య రఘుపతి పై పగ తీర్చుకోవడానికి నరేష్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు అనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. యం.యస్.రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏది ఏమైనా ‘మళ్ళీ పెళ్లి’ సినిమా పై జనాల ఫోకస్ అయితే గట్టిగానే ఉంది. అందుకే ఈ సినిమాకి బిజినెస్ బాగానే జరిగింది. నరేష్ కు ప్రాఫిట్స్ వచ్చేసాయి అనే టాక్ వినిపిస్తోంది.

మొన్న ఒక ప్రెస్ మీట్ లో నరేష్ ఈ చిత్రానికి రూ.15 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు. కానీ వాస్తవానికి ఈ చిత్రాన్ని రూ.8 కోట్ల బడ్జెట్లో ఫినిష్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఆల్రెడీ రూ.12 కోట్ల వరకు రికవరీ అయినట్లు సమాచారం. మరోపక్క థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు తెలుస్తుంది.టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు కలెక్షన్స్ తో ‘మళ్ళీ పెళ్లి’ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లు కూడా లేకపోలేదు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus