Malli Pelli Collections: డిజాస్టర్ గా మిగిలిన నరేష్, పవిత్ర ల ‘మళ్ళీ పెళ్లి’

నరేష్ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ గా ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. పవిత్ర లోకేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఎం.ఎస్.రాజు దర్శకుడు. ‘విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌’ పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.అనన్య నాగళ్ళ, అన్నపూర్ణ,వనిత విజయ్ కుమార్ వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. మే 26న ఈ మూవీ విడుదల అయ్యింది. టీజర్, ట్రైలర్ వంటివి జనాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

ఎందుకంటే ఇది నరేష్ – పవిత్ర ల జీవితంలోని సంఘటనలు ఆధారం చేసుకుని తీసిన కథ అని ప్రోమోలు స్పష్టం చేశాయి. మరీ ముఖ్యంగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పై రివేంజ్ తో తీసిన సినిమాలా కూడా కనిపించింది. ఫైనల్ గా అదే నిజమని తేలింది. దీంతో మొదటి రోజే ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా దారుణంగా నమోదయ్యాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.26 cr
సీడెడ్ 0.12 cr
ఆంధ్ర 0.16 cr
ఏపీ+ తెలంగాణ టోటల్ 0.54 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.09 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.63 cr

‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) చిత్రానికి రూ.1.49 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు. సో బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.1.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.0.63 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ కి ఈ మూవీ కోటి పైనే నష్టాలను మిగిల్చి డిజాస్టర్ గా మిగిలినట్టు స్పష్టమవుతుంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus