Malli Pelli Trailer: నరేష్ – పవిత్ర ల ‘మళ్ళీ పెళ్లి’ ట్రైలర్ ఎలా ఉందంటే?

  • May 11, 2023 / 12:36 PM IST

సీనియర్ నటుడు నరేష్ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ గా ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పవిత్ర లోకేష్.. నరేష్ కు జోడీగా నటిస్తుండడంతో ఈ సినిమాపై అందరి చూపు పడింది. ఎందుకంటే.. ప్రస్తుతం నరేష్ – పవిత్ర సహజీవనంలో ఉన్నారు.నరేష్ కు ఆల్రెడీ మూడు పెళ్లిళ్లు అయ్యాయి. పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవడానికి నరేష్ మూడో భార్య ఒప్పుకోవడం లేదు. ఆమె నరేష్ కు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేదు.

దీంతో నరేష్ చేసేదేమి లేక ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) అనే సినిమా తీసుకుని సరిపెట్టుకున్నాడు. ఇది నరేష్- పవిత్ర ల బయోపిక్ అని టీజర్ చెప్పకనే చెప్పింది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. టీజర్లో అయితే నరేష్ వైపు నుండి మాత్రమే కథని చూపించారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్లో పవిత్ర లోకేష్ లైఫ్ నరేష్ ఎంటర్ అయ్యే వరకు ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా చూపించారు.

అలాగే నరేష్ – పవిత్ర ల రిలేషన్ గురించి సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ఎలా స్పందించారు? అనే అంశాన్ని కూడా ట్రైలర్లో చూపించారు. ఈ చిత్రంలో నరేష్ – పవిత్ర వారి వారి పాత్రల్లోనే నటిస్తున్నారు. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పాత్రలో.. వనిత విజయ్ కుమార్ నటిస్తుంది. ట్రైలర్ ఆసక్తి కరంగా ఉంది. యం.యస్.రాజు ఈ చిత్రాన్ని నిర్మాత నరేష్ కు అనుకూలంగా తెరకెక్కించినట్లు స్పష్టమవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus