Malvika Sharma: ఫ్లాప్‌ హీరోయిన్‌తో ఫ్లాప్‌ హీరో.. రెండు మైనస్‌లు కలిస్తే హిట్టా?

  • May 26, 2023 / 04:24 PM IST

గోపీచంద్‌కు ఇటీవల కాలంలో ఏదీ కలసి రావడం లేదు. ఏ సినిమా చేసినా ఏదో ఒక సమస్య వస్తోంది. దీంతో కలసి రాక సినిమాకు సరైన ఫలితం రావడం లేదు. తాజాగా ఆయన నుండి వచ్చిన ‘రామబాణం’ సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితం అందుకోలేకపోయింది. హ్యాట్రిక్‌ మూవీ, బెస్ట్‌ కాంబినేషన్‌ అంటూ చాలా పెద్ద లెక్కలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర నిరాశపరిచింది. దీంతో గోపీచంద్ తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఓ కథానాయికను ఫిక్స్‌ చేశారు. అయితే ఆమె కూడా ఫ్లాప్‌లతో సతమవుతున్న నాయికే.

కన్నడ దర్శకుడు ఎ.హర్షతో ఓ సినిమా చేయనున్నారు గోపీచంద్‌. కె.కె.రాధామోహన్‌ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమా కోసం కథానాయికగా మాళవిక శర్మను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలు చేసిన మాళవిక ఇప్పటివరకు సరైన విజయం అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా ఫలితం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందా అనే చర్చ మొదలైంది. రెండు మైనస్‌లు కలిస్తే ప్లస్‌ అయినట్లు.. ఇద్దరు ఫ్లాప్‌ నటులు కలసి సినిమా చేస్తే హిట్‌ వస్తుందా అంటూ జోకులు కూడా పేలుతున్నాయి.

ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరో చెప్పలేదు కదా… మాళవిక శర్మ. అవును రవితేజ ‘నేల టిక్కెట్టు’, రామ్‌తో ‘రెడ్‌’ సినిమా చేసిన కథానాయికే. ‘నేల టిక్కెట్టు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మాళవిక ఆ సినిమాలో అందంతో మంచి మార్కులే సంపాదించింది. అయితే సినిమాకు సరైన ఫలితం రాకపోవడంతో బ్రేక్‌ రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు రామ్‌తో ‘రెడ్‌’ అనే సినిమా చేసింది. ఆ సినిమా ఫలితం కూడా దాదాపు ‘నేల టిక్కెట్టు’ పరిస్థితే.

ఆ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించని మాళవిక శర్మ… సోషల్ మీడియాలో మాత్రం తన పోస్టులు, ఫొటోలతో అదరగొడుతోంది. తాజాగా గోపీచంద్‌ సినిమాతో తెలుగులోకి తిరిగి రానుంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని సమాచారం. త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు. ఇక ఈ సినిమా గోపీచంద్‌కు 31వ చిత్రం.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus