శర్వానంద్ (Sharwanand) 35వ చిత్రంగా ‘మనమే’ (Manamey) ‘సినిమా… జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వ ప్రసాద్ (T. G. Vishwa Prasad) నిర్మించగా వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) సహా నిర్మాతగా వ్యవహరించారు. అలాగే విశ్వప్రసాద్ కూతురు కృతి ప్రసాద్ ‘క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా’ ఈ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మరోపక్క హీరోయిన్ గా కృతి శెట్టి (Krithi Shetty) నటించింది. ‘మనమే’ టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ సో సో గానే వచ్చాయి.కానీ 2వ రోజు బాగానే పికప్ అయ్యింది. 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసింది. కానీ మొదటి సోమవారం ఈ సినిమా కలెక్షన్లు అమాంతం పడిపోయాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.04 cr |
సీడెడ్ | 0.49 cr |
ఉత్తరాంధ్ర | 0.63 cr |
ఈస్ట్ | 0.15 cr |
వెస్ట్ | 0.10 cr |
కృష్ణా | 0.48 cr |
గుంటూరు | 0.36 cr |
నెల్లూరు | 0.16 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.41 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.37 cr |
ఓవర్సీస్ | 0.75 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 5.53 cr (షేర్) |
‘మనమే’ చిత్రానికి రూ.12.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.13 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.5.53 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.7.47 కోట్ల షేర్ ను రాబట్టాలి.