NBK 109 Glimpse Review: జాలి, దయ, కరుణకు అర్థం తెలియని అసురుడు.. గ్లింప్స్ అదుర్స్ అంటూ?

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈరోజు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటుండగా బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్స్ వచ్చాయి. ఎన్బీకే 109 మూవీ నుంచి పుట్టినరోజు కానుకగా మరో గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ గ్లింప్స్ లో బాలయ్యను పవర్ ఫుల్ గా చూపించారు. గ్లింప్స్ లో “దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు” అనే డైలాగ్ హైలెట్ గా నిలిచింది.

గ్లింప్స్ లో బాలయ్యకు డైలాగ్స్ లేకపోయినా బాలయ్య లుక్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు వీరమాస్ అనే టైటిల్ వినిపించగా టైటిల్ గురించి కానీ రిలీజ్ డేట్ గురించి కానీ మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఈ ఏడాది దసరాకు ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేనని ఆ సమయానికి రిలీజయ్యేలా ఉంటే మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించేవారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్బీకే 109 గ్లింప్స్ అదుర్స్ అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. గ్లింప్స్ కు థమన్ (Thaman) బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ మూవీ లోడింగ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుడతారేమో చూడాలి.

బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా త్వరలో ఇందుకు సంబంధించి అప్ డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాతో వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమాను మించిన సక్సెస్ అందుకుంటానని బాబీ ఫీలవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు (Jr NTR)జై లవకుశ (Jai Lava Kusa) సినిమాతో హిట్ ఇచ్చిన బాబీ బాలయ్యకు ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ ఇస్తారో చూడాలి.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus