Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణ రావు వర్థంతి శనివారం జరిగింది. ఆయన తెలుగు సినిమా పరిశ్రమను, తెలుగు సమాజాన్ని వదిలి తొమ్మిదేళ్లు అయిపోయింది. గత ఎనిమిదేళ్ల కాలంలో ఆయన వర్థంతి ఎలా జరిగింది, ఆయన సమాధి దగ్గర ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి అనేది పెద్దగా మీడియా దగ్గరకు రాలేదు కానీ.. ఈ తొమ్మిదో వర్థంతి మాత్రం రోజంతా మీడియాలో కనిపిస్తూనే ఉంది. దీనికి కారణం దాసరి సమాధి దగ్గర శనివారం నాడు జరిగిన కొన్ని పరిణామాలు.

Manchu Brothers

శనివారం మీడియాలో చూసినట్లయితే దాసరి సమాధి దగ్గరి ఇబ్బందికర పరిస్థితులు కనిపించాయి. ఆయన సమాధి చుట్టూ పిచ్చి మొక్కలు చేరి ఇబ్బందికరంగా మారింది. దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు, వీడియోలు వైరలైన విషయం తెలిసిందే. అలా ఓ నెటిజన్‌ షేర్‌ చేసిన వీడియోకు మంచు మనోజ్‌ స్పందించి, దాన్ని శుభ్రం చేస్తానని అన్నారు. అన్న మాట ప్రకారం శనివారం తన బృందంతో కలసి సమాధి వద్దకు వెళ్లారు.

దాసరి నారాయణరావు ఆ ప్రాంగణంలో ఉన్న చెత్తా చెదారాన్ని స్వయంగా తొలగించారు. దాసరి సమాధి దుస్థితి చూసి బాధేసింది. ఇక్కడకు వచ్చి మూడేళ్లవుతోంది. అప్పుడు కూడా ఇలానే ఉంటే శుభ్రం చేశాం. ఇప్పుడు మళ్లీ అలానే మారిపోయింది. సోషల్‌ మీడియాలో వైరలైన వీడియో టీమ్‌ నాకు శుక్రవారం రాత్రి షేర్‌ చేసింది. అందుకే ఈ రోజు ఉదయాన్నే వచ్చి శుభ్రం చేసి షూటింగ్‌కు వెళ్లాలని వచ్చాను అని మంచు మనోజ్‌ చెప్పారు.

మరోవైపు దాసరి సమాధి దుస్థితి సంగతి తెలుసుకున్న మంచు విష్ణు.. తన బృందాన్ని పంపించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసే పని పంపించారు. ఈ మేరకు కొన్ని వీడియోలు విడుదల చేశారు. మంచు కుటుంబం, దాసరి కుటుంబం బాగా సన్నిహితులు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాసరి వర్థంతి సందర్భంగా ఇలా జరగడం గమనార్హం.

మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus