మాల్దీవుల్లో మంచు ఫ్యామిలీ హల్ చల్..ఫోటోలు వైరల్!

Advertisement

ఏ ముహూర్తాన పెళ్ళైన తరువాత కాజల్ తన భర్తను తీసుకుని హనీమూన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్లిందో కానీ అప్పటి నుండీ మన టాలీవుడ్లో ఉన్న సెలబ్రిటీలు అందరూ వరుస పెట్టి అక్కడికి చెక్కేస్తున్నారు. నిజానికి కాజల్ అక్కడ ప్రతీ స్పాట్ దగ్గర ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అంతే వాటికి ఆకర్షితులైన మన టాలీవుడ్ హీరోయిన్లు వరుసగా అక్కడికి వెళ్లడం మొదలుపెట్టారు. ఈ లిస్ట్ లో ప్రణీత,రకుల్ ప్రీత్ సింగ్, దిశా పటాని, నిహారిక దంపతులు కూడా ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా మంచు ఫ్యామిలీ కూడా అక్కడ మెరిసింది. అవును మోహన్ బాబు మరియు అతని సతీమణి నిర్మలా దేవితో పాటు మంచు లక్ష్మీ కూడా అక్కడికి వెళ్లడం విశేషం. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది మంచు లక్ష్మీ. అక్కడి ప్రదేశాలను సందర్శించి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలతో పాటు తన తండ్రి మోహన్ బాబు మరియు అతని భార్య నిర్మలా దేవి ఫోటోలను కూడా షేర్ చేసింది. వీటికి ఆమె ‘భూతలస్వర్గం’ అంటూ ఓ కామెంట్ కూడా పెట్టింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన మనవరాలు, మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ హాలిడే ట్రిప్ కు వెళ్ళాలని కోరగా వెంటనే అక్కడికి వెళ్లారట మంచు ఫ్యామిలీ. త్వరలోనే మంచు విష్ణు దంపతులు అలాగే మంచు మనోజ్ కూడా అక్కడికి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read