Jr NTR: ఎన్టీఆర్ అక్కగా ఛాన్స్ కొట్టేసిన మంచు లక్ష్మి!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నటువంటి దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుపుకుంటుంది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి ఏ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నటువంటి ఈ సినిమా వచ్చే వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

ప్రస్తుతం షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ సినిమా గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క భాష నుంచి కూడా స్టార్ సెలబ్రిటీలు ఈ సినిమాలో భాగమయ్యారు.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరొక నటి కూడా నటించే అవకాశం అందుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కి అక్క పాత్రలో నటించే అవకాశాన్ని అందుకున్నారట నటి మంచు లక్ష్మి. మంచు లక్ష్మి ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమెకు ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందనే విషయం తెలియడంతో సినిమాపై మరి కాస్త అంచనాలు కూడా పెరిగిపోయాయి.

ఇందులో (Jr NTR) ఎన్టీఆర్ కి అక్క పాత్రలో మంచు లక్ష్మి నటిస్తున్నారట వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని తప్పకుండా ఆకట్టుకుంటాయని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి మంచు లక్ష్మి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus