చెడుగా మాట్లాడితే సింహంలా మారుతాను : మంచు లక్ష్మి

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురిగా పరిశ్రమకి పరిచయమైనప్పటికీ మంచు లక్ష్మి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా బుల్లితెర లోను, వెండితెరపైనా రాణిస్తోంది. తాజాగా ఆమె లీడ్ పాత్ర పోషించిన మూవీ “వైఫ్ ఆఫ్ రామ్”. దర్శకధీరుడు రాజమౌళి దగ్గర ‘ఈగ, బాహుబలి’ చిత్రాలకు శిష్యరికం చేసిన విజయ్ యలకంటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది. “సోషల్ మీడియాలో నాపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. వాటిలో కొన్నింటిని ఎంజాయ్ చేస్తుంటా. కానీ నా కుటుంబ పరువు తీసే వాటిని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఊరుకునేది లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

“నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేసి యూట్యూబ్ లో ఫోటోలు, వీడియోలు పెట్టి మార్ఫింగ్ చేసే వాళ్లను చెప్పుతో కొడుతా. దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి రా..  నా గురించి.. నా ఇంటిసభ్యుల గురించి ఎవడికి ఏం తెలుసు. నా ఫ్యామిలీపై  తప్పుడు కథనాలు వస్తే సింహంలా మారుతాను.. వారిని చంపేయాలని పిస్తుంది.” అంటూ విమర్శకులకు విరుచుకుపడింది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన  “వైఫ్ ఆఫ్ రామ్” తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus