‘వైఫ్ ఆఫ్ రామ్’ గా మంచు లక్ష్మి

కంటెంట్ ఉన్న సినిమాలతో అలరించే నటి మంచు లక్ష్మి. తండ్రికి తగ్గ తనయగా, బెస్ట్ యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకున్న మంచు లక్ష్మి మరోసారి ఓ సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతోంది. చాలా రోజులు క్రితమే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ టైటిల్ ను సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు. ‘‘వైఫ్ ఆఫ్ రామ్’’ ఈ చిత్రం పేరు. కథకు ఖచ్చితంగా సరిపోతుందని భావించి ఈ టైటిల్ నిర్ణయించారు. టైటిల్ చాలా బావుందని చిత్ర యూనిట్ తో పాటు చాలామంది నుంచి మంచి అప్రిసియేషన్ వస్తోంది. ‘వైఫ్ ఆఫ్ రామ్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఇందులో మంచు లక్ష్మి పాత్ర చాలా భిన్నంగా సాగుతుంది. అబద్ధాలను నిజమని నమ్మే పాత్రలో మంచు లక్ష్మి కనిపిస్తుంది. ఈ పాత్రలో ఆమె నటన చాలా సహజంగా, అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.

పూర్తి వైవిధ్యంగా మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే కథ ఇది. రాజమౌళి వద్ద ‘ఈగ’, ‘బాహుబలి-1’ చిత్రాలకు అసిస్టెంట్ గా పనిచేసిన విజయ్ యలకంటి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మంచు లక్ష్మి టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘వైఫ్ ఆఫ్ రామ్’లో సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, పెళ్ళి చూపులు ఫేమ్ ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus