ప్రతిష్టాత్మక ‘ఒట్టావా ఇండియన్ ఫిిలిం ఫెస్టివల్’ కు ఎంపికైన ‘వైఫ్ ఆఫ్ రామ్’

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా వైఫ్ ఆఫ్ రామ్. ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కాబోతోంది. విడుదలకు ముందే ఓ అరుదైన గౌరవాన్ని అందుకుంది వైఫ్ ఆఫ్ రామ్. ‘ఒట్టావా ఇండియన్ ఫిలిమ్ ఫెస్టివల్’లో అఫీషియల్ స్క్రీనింగ్ కు వైఫ్ ఆఫ్ రామ్ ఎంపికయింది. కెనడాలోని ఒట్టావాలో ఈ నెల 13నుంచి 17వరకూ జరగబోయే ఈ ఇండియన్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ఫిక్షన్ విభాగం నుంచి 9 చిత్రాలు.రెండు డాక్యుమెంటరీలు, 5 షార్ట్ ఫిలిమ్స్ ను సెలెక్ట్ చేసింది జ్యూరీ.

వీటిని ఇండియాలోని 9 ప్రధాన నగరాల నుంచి సెలెక్ట్ చేశారు. వీటిలో హైదరాబాద్ నుంచి మంచు లక్ష్మి ‘వైఫ్ ఆఫ్ రామ్’ కు అఫీషియల్ ఎంట్రీ దక్కడం విశేషం. ఈ మొత్తం చిత్రాల్లో ఆల్రెడీ రిలీజ్ అయినవే ఉన్నాయి. కానీ రిలీజ్ కు ముందే సెలెక్ట్ అయిన చిత్రంగా వైఫ్ ఆఫ్ రామ్ కు అరుదైన గౌరవం దక్కింది.విజయ్ యెలకంటి దర్శకత్వంలో రూపొందిన ‘‘వైఫ్ ఆఫ్ రామ్’’ ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతినిచ్చే చిత్రంగా పేర్కొంది ఒట్టావా ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.

ఓ NGO లో పనిచేసే దీక్ష అనే యువతి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె భర్తను ఎవరో హత్య చేస్తారు. ఆ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఆ యువతి ఎదుర్కొన్ని వింత, భయానక పరిస్థితులేంటీ అనేది కథ. ఈ చిత్రాన్ని ఒట్టావా ఫిలిమ్ ఫెస్టివల్ ‘సోషియల్లీ కాన్సియస్ థ్రిల్లర్’గా పేర్కొనడం విశేషం.

వైఫ్ ఆఫ్ రామ్ దర్శకుడు విజయ్ ఈ నెల 10న ఒట్టావా వెళ్లనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీనింగ్ అయిపోయేంత వరకూ అతను అక్కడే ఉండి అన్ని అన్ని పనులు చూసుకోబోతున్నాడు. ఈ ఫెస్టివల్ లో ఇండియాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దర్శకులతో పాటు విదేశీ దర్శకులను కూడా విజయ్ కలుసుకోనున్నారు. ఒట్టావా ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు ఎంపికైన తొలి చిత్రం కూడా వైఫ్ ఆఫ్ రామ్ ఘనత దక్కించుకుంది. ఆ ఘనతను హైదరాబాద్ కు తీసుకువచ్చిన దర్శకుడు విజయ్ యెలకంటితో పాటు నటి నిర్మాణ భాగస్వామి మంచు లక్ష్మిని అభినిందించాల్సిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus